Dilraju,Tejaswini: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న దిల్ రాజు సతీమణి.. నిజమెంత?

  • November 23, 2022 / 07:16 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్థాయి సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగానే ఉన్నారు. అయితే ఈయన మొదటి భార్య అనిత మరణించిన తర్వాత తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.

ఈ విధంగా దిల్ రాజు భార్య తేజస్వినికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా తేజస్విని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.తేజస్వినికి కాలేజీ చదివే రోజులలో నుంచి మోడలింగ్ రంగంలోనూ అలాగే నటిన పై ఎంతో ఆసక్తి ఉండడంతో ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాలని భావించారట. అయితే ఇలాంటివన్నీ తన ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో ఈమె తన కోరికను చంపుకున్నారు.

ఈ క్రమంలోనే తేజస్విని దిల్ రాజును వివాహం చేసుకున్న అనంతరం తన మనసులో ఉన్న కోరికను మరోసారి బయట పెట్టారట.దీంతో తన భార్యకు ఎంతో ఇష్టమైన మోడలింగ్ రంగంలోకి తనని పంపించడం కోసం దిల్ రాజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.అదేవిధంగా మోడలింగ్ రంగంలోకి వెళ్లిన అనంతరం తన సినిమాలలో కూడా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

తేజస్విని టాలీవుడ్ సినిమాలలో కొన్ని కీలక పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమైందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.తన గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఎంతోమంది నెటిజన్ లు పెద్ద ఎత్తున దిల్ రాజు పై ట్రోలింగ్ చేస్తున్నారు.మరి దిల్ రాజు భార్య గురించి వచ్చేటటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus