నిన్న సాయంత్రం జరిగిన “పెట్ట” ప్రీరిలీజ్ ఈవెంట్ లో అశోక్ వల్లభనేని నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఉదయమే బన్నీ వాసు స్పందించగా.. ఇవాళ జరిగిన “ఎఫ్ 2” ట్రైలర్ లాంచ్ టైమ్ లో దిల్ రాజు కూడా రెస్పాండ్ అయ్యాడు. ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. “సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతుంటే అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయి. మూడు తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి. 18వ తేదీ నుంచి పేటనే ఉంటదని చెబుతున్న అశోక్ ఆరోజే విడుదల చేసుకోవచ్ఛు కదా. ఈ ఏడాది పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నా. తెలుగు సినిమాల విడుదల తేదీ ఆరు నెలల ముందే ప్రకటించాం. అశోక్ అనుచితంగా మాట్లాడటం సరైంది కాదు” అన్నారు.
ఇప్పుడు అల్లు అరవింద్ మరియు దిల్ రాజు కలిసి ఇప్పటివరకూ అశోక్ కు ఉన్న మిగతా థియేటర్లు కూడా పోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఏషియన్ సినిమాస్ కూడా తమ సహకారాన్ని వెనక్కి తీసుకొన్నారు. ఆ కారణంగా “పెట్ట” సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ సమస్యలు ఎదుర్కొనేలా ఉంది. ఈ కారణంగా ఒకవేళ సినిమా హిట్ అయినా కూడా నిర్మాతకి భారీ నష్టాలు రావడం ఖాయం.