సోషల్ మీడియాలో సెలబ్రిటీల పిల్లలకు ఉండే క్రేజే వేరు. తమ అభిమాన తారలతో సమానంగా వారిని ప్రేమిస్తుంటారు అభిమానులు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో కలిసి చేసే అల్లరికి సంబంధించిన వీడియోలను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి ఓ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ ఉంటుంది.
అయితే ఇప్పుడు బన్నీ తన కూతురు అర్హను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అర్హను పెట్టి ‘అంజలి అంజలి’ వీడియో సాంగ్ ను రీక్రియేట్ చేశారు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్హ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పిల్లల కాన్సెప్ట్ తో ఓ సినిమా తీయబోతున్నారు. ఇందులో అల్లు అర్హను లీడ్ రోల్ లో తీసుకోవాలనుకుంటున్నారు.
ఈ సినిమాతో సురేష్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమాలో అర్హతో పాటు అయాన్ కూడా కనిపిస్తాడేమో చూడాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తరువాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది!