అరవ సినిమాలపై అగ్ర నిర్మాత ఆసక్తి..!

తమిళ సినిమాలు అనువాద రూపంలో తెలుగు తెరపైకి రావడం అనాదిగా చూస్తున్నదే. సాధారణంగా ఈ సినిమాలను నిర్మాణ రంగంలోకి రావాలనుకునే కొందరు పంపిణీదారులు అనువాద హక్కులు కొని విడుదల చేస్తుంటారు. ఓ రకంగా ఈ తరహా సినిమాల కోసం ప్రత్యేకంగా ఓ వర్గం ఉంది. బడా హీరోల సినిమాలైతే అగ్ర నిర్మాతలు కూడా రంగంలోకి దిగి ప్రాంతాల వారీగా సదరు సినిమా హక్కులు కొని సొమ్ము చేసుకుంటారు. అయితే ఎప్పుడూ నాలుగైదు సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా పేరున్న దిల్ రాజు అరవ సినిమాలపై కన్నేశాడు.

పంపిణీదారుడిగా ఉన్న దిల్ రాజు మణిరత్నం తెరకెక్కించిన ‘అమృత’ సినిమా తెలుగు అనువాద హక్కులు కొని నిర్మాతగా మారాడు. తర్వాత వరుసగా తెలుగు సినిమాలు నిర్మిస్తూ, విజయాలు అందుకుంటూ అగ్ర నిర్మాతగా అవతరించాడు. ‘అమృత’ తర్వాత అడపాదడపా అనువాద సినిమాలను పంపిణీ మాత్రమే చేసిన ఈ నిర్మాత గతేడాది విడుదలైన ‘ఒకే బంగారం’సినిమాలతో మళ్ళీ అనువాద చిత్రాల జోలికి వెళ్ళాడు. ఈ సంవత్సరం కూడా తమిళ స్టార్ హీరో విజయ్ ‘థెరి’ సినిమాని ‘పోలీస్’గా అనువదించిన రాజు ఇప్పుడు ‘రెమో’ అనే మరో తమిళ సినిమాని తెలుగు తెరపైకి తీసుకొస్తున్నాడు.

విజయ్ అంటే ‘స్నేహితుడు’, ‘తుపాకి’ లాంటి సినిమాలతో కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్నాడు. ‘రెమో’ చిత్ర హీరో శివకార్తికేయన్ తమిళ నాట వరుస విజయాలు అందుకుంటున్నా తెలుగు ప్రేక్షకులకు కొత్త. ఇక దర్శకుడి మాటకొస్తే ఇదే అతడికి మొదటి చిత్రం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ‘నేను శైలజ’తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం కీర్తి నాని హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్న ‘నేను లోకల్’ సినిమాలో నటిస్తోంది. తనకోసమే రాజు ఇంత పెట్టుబడి పెట్టాడన్నది వట్టిమాటే.

దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘సుప్రీమ్’ మే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంకో నాలుగు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి ఇప్పట్లో తెరమీదికొచ్చే అవకాశం లేదు. పండగ సీజన్ అయినా పంపిణీ రూపేణా లాభాలు రాబట్టడానికి తెలుగులో పెద్ద సినిమాలు లేవు. అంచేత కీర్తి ద్వారా ‘రెమో’ సినిమా వివరాలు రాబట్టి తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచినా ఈ సినిమాని దిల్ రాజు తెలుగు తెరమీదికి తీసుకొస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 7న తమిళనాట విడుదల కానుంది. ఆ రోజున విడుదల కానున్న తెలుగు సినిమాల లిస్ట్ చాలా పెద్దది. పైగా సినిమా ప్రమోషన్ కూడా మొదలెట్టలేదు. ఆ లెక్కన ‘రెమో’ తెలుగు రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ప్రస్తుతానికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus