ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన దిలీప్ కుమార్..!

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పలు ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఏప్రిల్ 15 న ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడటంతో ఆయన్ను ఇవాళ డిశ్చార్జి చేశారు. బుధవారం సాయంత్రమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉండగా.. అది ఇవాల్టికి వాయిదా వేసినట్లు లీలావతి వైద్యులు తెలిపారు.

దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్ కాగా.. ఆరు శతాబ్దాల ఆయన సినీ ప్రస్థానంలో మధుమతి, దేవ్ దాస్, మొఘల్ ఏ ఆజామ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ తదితర చిత్రాల్లో నటించారు. 1998 లో వచ్చిన కిలా చిత్రంలో ఆయన చివరి సారి నటించారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 1994 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2015 పద్మ విభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus