Diljit: తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడిన స్టార్ సింగర్!

ఇంటర్నేషనల్ ఇండియన్ సింగర్ కమ్ మ్యూజీషియన్ దిల్జిత్ తన దిల్లుమినాటే మ్యూజికల్ టూర్ లో భాగంగా నవంబర్ 15న హైదరాబాద్ లో షో నిర్వహించిన విషయం తెలిసిందే. వేలాది మంది జనాలు హాజరైన ఈ కాన్సర్ట్ సూపర్ సక్సెస్ ఫుల్ అనే చెప్పాలి. ఈమధ్యకాలంలో ఈస్థాయిలో మరే ఇతర కాన్సర్ట్ సక్సెస్ అవ్వలేదు. అయితే ఈ తరహా కాన్సర్టుల్లో మన టాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించడం అనేది ఇప్పటివరకు జరగలేదు.

Diljit

అయితే.. నిన్న జరిగిన దిల్జిత్ కాన్సర్ట్ లో మాత్రం సింగర్ దిల్జిత్ స్వయంగా ప్రభాస్ (Prabhas)  పేరు తీసుకురావడం, “కల్కి” (Kalki 2898 AD)  సినిమాకి తాను పాడిన పాట మేకింగ్ విషయాలు చెప్పుకురావడం, అదే సందర్భంలో ఇక్కడ ఎంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ను పలకరించడం సదరు షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే.. షో మొదట్లో తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డాడు దిల్జిత్.

కాన్సర్ట్ పర్మిషన్స్ విషయంలో చాలా నిబంధనలు విధించారని, ఆఖరికి ఇలాంటి పాటలు పాడాలో కూడా వాళ్లే నిర్ణయించారని ఒక ఆర్టిస్ట్ కి ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఏమిటి? అని తన బాధను వెళ్లగక్కాడు దిల్జిత్. ఇకపోతే.. ప్రభాస్ పాన్ ఇండియన్ ఇమేజ్ ను దిల్జిత్ లాంటి ఓ సూపర్ పాపులర్ సింగర్ కూడా తన షోలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడానికి వినియోగించుకోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం.

ఇకపోతే.. డార్లింగ్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పెషల్ అప్డేట్స్ ఇవ్వడం త్వరలోనే మొదలెట్టనున్నాడని సమాచారం. హైదరాబాద్ లో జరుగుతున్న సినిమా ఎక్స్ పోలో ఈ విషయమై ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఖ్యాతి ఈ విధంగా ఖండాంతరాలు వ్యాపిస్తుండడం ఆయన అభిమానులకు ఎనలేని ఆనందాన్ని పంచుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus