దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రెండో సినిమాగా సెల్ఫిష్ చేస్తున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న ఇతను ఇప్పుడు మూడో సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు. ‘ లవ్ మీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఇఫ్ యు డేర్’ అనేది క్యాప్షన్. ఇక ఈ సినిమా ఓపెనింగ్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ… ” ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ అనే సినిమా మొదలవ్వడానికి నాగ, అరుణ్ కారణం. నాగ నాకు చాలా కాలం క్రితం నుండే పరిచయం. ఓ స్క్రిప్ట్ వినండి.. నా ఫ్రెండ్‌తో కలిసి చేశామని చెప్పాడు. దీంతో అరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ స్క్రిప్ట్ విన్న క్షణమే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాను. ‘ఆర్య’ కథ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. మళ్లీ ఈ కథ విన్నప్పుడు నాకు ‘ఆర్య’ వైబ్స్ కలిగాయి. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ఆశిష్ ని అడిగారు హీరోగా.
లానే హర్షిత్, హన్షిత్ కూడా ఉంటే బాగుంటుందని నాగ అన్నారు. కథ చెప్పి నన్ను ఇంప్రెస్ చేసి గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ చేశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. టెక్నీషియన్స్ పేర్లు చెబితే భయం వేసింది. పీసీ శ్రీరామ్ ,మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పేశారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో బేబీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది.
వైష్ణవి ఆఫీస్‌కు వచ్చి స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఫుల్ ఎగ్జైట్ అయ్యింది. ఇలా ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా జరుగుతుంది. సో ఆడియన్స్ కూడా దీనిని ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 27న టైటిల్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 27న రిలీజ్ అనుకుంటున్నాం. బలగం తర్వాత హర్షిత్, హన్షితలు వేరే ప్రాజెక్ట్ చేయాలి, ఆశిష్ కూడా వేరే ప్రాజెక్ట్ చేయాలి… కానీ ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. నాకు ‘ఆర్య’ విషయంలో ఏం జరిగిందో.. ఈ టీం అందరికీ కూడా అదే జరగబోతోందని అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.