Sreeleela: శ్రీలీలను ఏకంగా లెజెండ్రీ హీరోయిన్స్ తో పోల్చేశాడుగా..!

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. కాజల్‌ , శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది.నిర్మాత దిల్‌ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌ తీసే ధైర్యం తనకు లేదన్నారు.

ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయానని, సీక్వెల్‌ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే వెంటనే తీస్తానని చెప్పారు. ‘‘మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌ రావిపూడి ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. ‘భగవంత్‌ కేసరి’ గురించి నాకు ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ మాండలికంలో బాలకృష్ణ సంభాషణలు చెబితే చాలా కొత్తగా ఉంటుందన్నా. ముందు నుంచీ ‘బ్రో ఐ డోంట్‌ కేర్‌’ని టైటిల్‌ అనుకుని తర్వాత ‘భగవంత్‌ కేసరి’గా మార్చాడు.

ఎక్కువగా ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు తీసే అనిల్‌ ఇలాంటి బలమైన కథను రాయడం గొప్ప విషయం. నటిగా శ్రీలీలకు (Sreeleela) మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్‌ అనేవారు. కానీ, ఇందులోని ఆమె నటన జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలకృష్ణ డెడికేషన్‌తో నటించారు. ఇది లాంగ్‌రన్‌ ఫిల్మ్‌’’ అని దిల్‌ రాజు అన్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus