ఆ నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడా..?

ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అధినేత దిల్ రాజు ఇబ్బందుల్లో ఉన్నాడా? అప్పట్లో ఏది పట్టినా బంగారం అయిన రాజుకి ఇప్పుడు అసలు టైమ్ కలసి రావడం లేదా? ఎన్నో అంచనాలతో తీయాలనుకున్న ప్రాజెక్ట్స్ గాడితప్పుతున్నాయా అంటే అవును అనే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. బ్యానర్ పేరు చూడగానే సగటు ప్రేక్షకుడు సినిమా చూడవచ్చు అన్న  నమ్మకం కలిపించిన నిర్మాతల్లో మన రాజు ఒకడు. అయితే అలాంటి నిర్మాతకు ఈ మధ్య కాలం కలసి రావడంలేదు. తాజాగా రాజు రూపొందించాలి అనుకున్న రెండు సినిమాలు ఇంకా మొదలు కాకపోవడంతో డైలామలో పడ్డాడు దిల్ రాజు. రవి తేజ హీరోగా ఒక మంచి కధతో పక్కాగా ఒక సినిమా చెయ్యాలని ఫిక్స్ అవ్వగా, కొన్ని అనివార్య కారణాల వల్ల, రవి తేజ చేసిన పని వల్ల ఆ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. ఇక చేసేది ఏమీ లేక అదే ప్రాజెక్టును నాగ్ తో చేసేందుకు డిసైడ్ అయ్యాడు.

మరో పక్క మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో తీయాలని తలపెట్టిన శతమానం భవతి విషయంలో కూడా అనుకోని ఎదురు దెబ్బ తగలడం వల్ల ఆ సినిమాకు బుల్లి తెర మెగా స్టార్  రాజ్ తరుణ్ ను ఎంపిక చేసి, తెరకెక్కిస్తున్నాడు. అయితే ఒక పక్క రవి తేజ రెమ్యునిరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టగా, ఇక సాయి ధర్మ తేజ సినిమా విషయంలో మాత్రం పెద్దగా చెప్పుకోవాల్సిన కారణం ఏమీ లేదు, ఒక్క ఈగొ ఫ్యాక్టర్ తప్ప. మరి ఇలానే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా గాడి తప్పితే, రాజుకి మరిన్ని ఇబ్బందులు తప్పవు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus