Game Changer: దిల్ రాజు, శంకర్ మధ్య గ్యాప్ నిజమా.. అసలేమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు గుర్తింపు ఉండగా సినిమాల విషయంలో దిల్ రాజు ప్లానింగ్ మామూలుగా ఉండదు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా దిల్ రాజు తనదైన శైలిలో ప్రమోషన్స్ చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైనా ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరగడం లేదు. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది.

దిల్ రాజు ఈ సినిమా కోసం అంచనాలను మించి ఖర్చు చేసిన నేపథ్యంలో దిల్ రాజు సినీ కెరీర్ లో ఈ సినిమా రిస్కీ ప్రాజెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దిల్ రాజు, శంకర్ మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అటు దిల్ రాజు కానీ ఇటు శంకర్ కానీ ధృవీకరించలేదనే సంగతి తెలిసిందే. దిల్ రాజు జీ స్టూడియోస్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న (Game Changer) ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. చరణ్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాలి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీతో పాటు అంజలి నటిస్తున్నారు. ఈ సినిమా ఎంతోమందికి మంచి పేరును తెచ్చిపెడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus