Dimple Hayathi: ఆ స్టార్ హీరో సినిమాలో ప్రత్యేక సాంగ్ చేయనున్న డింపుల్ హయాతి!

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా పెట్టారు. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ డింపుల్ హయతి చేస్తే బాగుంటుందని భారతీయుడు 2 మూవీ టీమ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు గల్ఫ్, ఖిలాడి లాంటి సినిమాలలో నటించింది. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన సినిమా ‘రామబాణం’.

అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోవడంతో మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తోంది. అయితే, తాజాగా డింపుల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భామకు ఓ భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు సమాచారం. ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ , దర్శకుడు శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్‌ 2’. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం కోసం డింపుల్‌ హయాతిని టీమ్‌ సంప్రదించిందని టాక్‌ వినిపిస్తోంది.

వారి ఆఫర్‌ను (Dimple Hayathi) డింపుల్‌ ఓకే చేసినట్లు సమాచారం. త్వరలోనే దీని చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 1996లో వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్నదే ఈ ‘ఇండియన్‌2’. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది.

ఇక రకుల్ ప్రీతీ సింగ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు లోగా షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేసారు మూవీ టీమ్. ఇక భారతీయుడు 2 సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరిలో అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus