టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అనే సంగతి తెలిసిందే. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. కర్ణాటక రాష్ట్రంలోని రైచూర్ లో జన్మించిన రాజమౌళి బాల్యం నుంచి కథలు చదవడాన్ని ఎంతగానో ఇష్టపడేవారు. రాజమౌళికి అమరచిత్రకథలు అనే పుస్తకం ఎంతో ఇష్టమైన పుస్తకం కాగా ఖాళీ సమయం దొరికితే కథల పుస్తకాలను చదువుకుంటూ ఉండేవారు.
సాధారణంగా ఎవరైనా విన్న కథను మార్చి చెప్పడానికి ఇష్టపడరు. అయితే రాజమౌళి మాత్రం కథను ఇష్టానుసారం మార్చి ఆ కథకు అనేక విశేషాలను జోడించి చెప్పేవారు. రాజమౌళి పదేపదే కథలు చెబుతూ ఉండటంతో అతని స్నేహితులు విసుక్కునేవారు. ఇంటర్ పాసైన తర్వాత ఖాళీగా ఉన్న రాజమౌళికి జీవితంలో ఏం చేద్దామని అనుకుంటున్నావని కీరవాణి భార్య శ్రీవల్లి నుంచి ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న రాజమౌళి జీవితాన్ని మార్చేయడం గమనార్హం. ఆ తర్వాత తండ్రి సూచనలతో ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర రాజమౌళి ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేరారు.
టీడీపీ పార్టీకి ప్రకటనల కోసం మంచి కాన్సెప్ట్ చేసినవాళ్లకు ఐదువేల రూపాయలు ఇచ్చేవారు. జక్కన్న కూడా కాన్సెప్ట్ ఇచ్చి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు. జక్కన్న తొలి సంపాదన ఐదు వేల రూపాయలు కాగా సంవత్సరానికి పాతిక కాన్సెప్ట్ లు చేసి జక్కన్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జక్కన్న శాంతినివాసం సీరియల్ తో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో సినిమా డైరెక్టర్ గా మారారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు