‘చీప్ స్టార్’ అంటూ సంచలన కామెంట్ చేసిన ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు

రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం వచ్చి ఏడాది దాటుతున్నప్పటికీ ఇంకా తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టలేదు ఈ డైరెక్టర్. ‘మహాసముద్రం’ అనే కథ రాసుకుని హీరోల దగ్గరకి తిరిగాడు. కానీ ఎవ్వరూ ఫైనల్ చేయలేదు. రవితేజ ఓకే చేసాడని వార్తలొచ్చాయి.. ఈ చిత్రంలో తమిళ హీరో సిద్దార్థ్ కూడా నటిస్తాడని చెప్పుకొచ్చారు. కానీ ఆ వార్త పై అటు రవితేజ కానీ… ఇటు అజయ్ భూపతి కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే… తాజాగా తన సోషల్ మీడియాలో ‘చీప్ స్టార్’ అంటూ ట్వీట్ వేశాడు అజయ్ భూపతి.

ఇప్పుడు ఈ ట్వీట్ పై పెద్ద చర్చ మొదలైంది. అసలు ఎవర్ని ఉద్దేశించి అజయ్ ఈ ట్వీట్ చేశాడు. చీప్ స్టార్ ఏ హీరో? అనే గుసగుసలు మొదలయ్యాయి. రవితేజనా అన్నాడా ..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.’మహాసముద్రం’ ప్రాజెక్ట్ ను రవితేజ తో పాటు రామ్, నాగచైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలకి కూడా వినిపించాడు. వెళ్ళలో ఆ చీప్ స్టార్ ఉన్నాడా? లేక ‘చీప్ స్టార్’ అనే టైటిల్ తో కొత్త సినిమా తీస్తున్నాడా అనేది అజయ్ స్పందిస్తేనే కానీ చెప్పలేం. సోషల్ మీడియాలో మాత్రం ఈ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus