Anil Ravipudi: ఆ కామెంట్లు హర్ట్ చేయడం వల్లే అనిల్ భగవంత్ కేసరి తీశారా?

పటాస్ నుంచి ఎఫ్3 వరకు అనిల్ వరుసగా డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ లను అందుకున్నా స్టార్ హీరోలలో చాలామంది అనిల్ డైరెక్షన్ లో నటించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లా అనిల్ రావిపూడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడానికి ఆయన కామెడీ సినిమాలు తీయడమే కారణమని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఫుల్ లెంగ్త్ మాస్ కమర్షియల్ సినిమాలను అనిల్ డీల్ చేయలేడని చాలామంది భావిస్తారు.

అయితే భగవంత్ కేసరి మూవీ ఆ విమర్శలకు జవాబు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. భగవంత్ కేసరి సినిమా సక్సెస్ సాధిస్తే అనిల్ రావిపూడి రేంజ్ పెరగడంతో పాటు ఆయన కోరుకున్న విజయాలు దక్కుతాయని అభిమానులు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి రిజల్ట్ తో ఏ స్టార్ హీరో డేట్లను సంపాదిస్తారో చూడాల్సి ఉంది. మహేష్ తప్ప 200 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న మరే హీరోతో అనిల్ రావిపూడి (Anil Ravipudi) పని చేయలేదు.

అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరగగా ఆ స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కడం లేదు. అనిల్ రావిపూడి భవిష్యత్తు సినిమాలు సైతం కమర్షియల్ అంశాలు కీలకంగా తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. భగవంత్ కేసరి మూవీ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

కాజల్, శ్రీలీల, థమన్ కెరీర్ కు భగవంత్ కేసరి కీలకం కాగా మరో 48 గంటల్లో ఈ సినిమా రిజల్ట్ తేలిపోనుంది. అనిల్ రావిపూడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి ప్రభంజనం మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో లియో నుంచి గట్టి పోటీ ఉన్నా ఇతర ఏరియాలలో భగవంత్ కేసరి డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus