అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ పెంచేసాడట…!

మహేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి డైరెక్షన్లో ‘మ‌హ‌ర్షి’ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫినిషింగ్ స్టేజీలో ఉంది. సమ్మర్ కానుకగా మే 9 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని.. చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలుసుంది. ఇది మహేష్ 25 వ చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం తరువాత అనీల్ రావిపూడి డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడు మహేష్. ఈ చిత్రాన్ని ’14 రీల్స్ సంస్థ’ నిర్మిస్తుండగా దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ పై ఇప్పుడు ఫిలింనగర్లో చర్చ మొదలయ్యింది.

‘పటాస్‌’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్‌’ ‘ఎఫ్‌2’ వంటి వ‌రుస హిట్స్ తో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి మ‌హేష్‌ చిత్రం కోసం తన రెమ్యూనరేషన్ ని కొంచెం పెంచాడట. మొన్నటి వరకూ ఒక్కో సినిమాకి మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే అనీల్ రావిపుడి ‘ఎఫ్-2’ భారీ హిట్ అవ్వడంతో దానిని 5 కోట్లు చేశాడట. అయినా నిర్మాతలు వెనకడుగు వేయట్లేదంట. అనీల్ రావిపూడి మీద ఉన్న నమ్మకంతో తను అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పేశారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ – ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇక హీరోయిన్ వేటలో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus