Bobby, Balakrishna: బాబీ బిహేవియర్ వల్ల ఆ నిర్మాతలు హర్ట్ అయ్యారా. ఏమైందంటే?

ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. 9 నెలలకు ఒక సినిమాను పూర్తి చేస్తున్న బాలకృష్ణ ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య తన పుట్టినరోజు కానుకగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాను ప్రకటించనుండగా బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.
బలగం డైరెక్టర్ వేణు డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నా అధికారికంగా ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

అయితే బాలయ్య బాబీ కాంబినేషన్ లో సినిమా అంటే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో అడ్వాన్స్ లు వచ్చినా ఆ అడ్వాన్స్ లను బాబీ తీసుకోలేదని బోగట్టా. బాలయ్య డేట్లు సితార బ్యానర్ దగ్గర ఉండటంతో ఆ బ్యానర్ లో సినిమాకు బాబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అయితే బాబీ బాలయ్యతో (Balakrishna) చేయాలని కోరితే తాము బాలయ్య డేట్లను అడిగి తీసుకునేవాళ్లమని మైత్రీ నిర్మాతలు తమ సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. బాబీ బిహేవియర్ వల్ల మైత్రీ నిర్మాతలు హర్ట్ అయ్యారని తెలుస్తోంది. స్టార్ హీరో బాలకృష్ణ, మైత్రీ నిర్మాతల మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. బాబీ ఈ విధంగా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తులో మైత్రీ బ్యానర్ లో బాబీకి ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో బాబీ రెమ్యునరేషన్ సైతం పెరిగింది. చిరంజీవికి భారీ హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యకు ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus