‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు బాబీని (K. S. Ravindra) ఓ రేంజ్లో లేపాడు చిరు (Chiranjeevi). ‘చాలా మంది సీనియర్ డైరెక్టర్లు.. తాను అనుభవంతో చెప్పిన మాటలు పట్టించుకోలేదని, పక్కన పెట్టి.. తన 40 ఏళ్ళ అనుభవాన్ని అవమానించారని, కానీ దర్శకుడు బాబీ మాత్రం అలా చేయకుండా తన మాటకి ఎంతో గౌరవం ఇచ్చాడని, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విషయంలో అతను 10 నిమిషాలకు మించి వేస్ట్ ఫుటేజీ తీయలేదని, నిర్మాతల డబ్బుని, నటీనటుల విలువైన కాలాన్ని అతను వృధా చేయలేదని.
అతను వేస్ట్ చేసింది పేపర్ల రూపంలో మాత్రమే’ అని చిరు చెప్పుకొచ్చాడు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఫాస్ట్ గా ఫినిష్ అవ్వడం వెనుక ఇదే కారణం అని కూడా చిరు తెలిపారు. కానీ అదే పద్ధతిని బాలయ్య (Nandamuri Balakrishna) విషయంలో మాత్రం ఫాలో అవ్వలేకపోతున్నాడు బాబీ. ఈ మధ్య బాలయ్య ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేసే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఆయనది. తన 109వ సినిమాని బాబీ డైరెక్షన్లో చేయడానికి బాలయ్య (Balayya Babu) ఓకే చెప్పారు.
త్వరగా కంప్లీట్ చేసి ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బాబీ మాత్రం తెవల్చడం లేదు. కొంత పోర్షన్ రీ షూట్ చేస్తున్నాడట. అలాగే ఈ సినిమా కథ ప్రకారం ఇంకో హీరో కూడా అవసరమట. ఆ హీరో ఇంకా సెట్ అవ్వలేదు. అతని పార్ట్ షూటింగ్ కూడా పెండింగ్ ఉంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని టాక్.