‘గేమ్ ఛేంజర్’ (Game changer) రెండో పాట.. మొదటి పాటలా నెట్లో లీక్ అవ్వకముందే ఈరోజు అధికారికంగా రిలీజ్ చేశారు. తక్కువ టైంలోనే ఈ పాట చర్చనీయాంశం అయ్యింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి : ఈ లిరికల్ సాంగ్ 4 నిమిషాల 42 సెకన్ల నిడివి ఉంది. చూస్తుంటే ఇది రాంచరణ్ (Ram Charan) ఇంట్రో సాంగ్.. లా అనిపిస్తుంది. దర్శకుడు శంకర్ (Shankar) శైలికి తగ్గట్టు గ్రాండ్ గా కనిపిస్తుంది.
‘కళ్ళ జోడు తీస్తే మీలాంటివాడ్నే, షర్ట్ పైకి పెడితే మీలాంటి వాడ్నే..,టక్కు టై తీస్తే మీలాంటి వాడ్నే, నాటు బీటు బీటు వింటే మీలాంటి వాడ్నే, కన్న ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా.. నేనైనా నీలాంటోడ్నే’ అంటూ యమ హుషారుగా సాగింది ఈ పాట. ‘రా మచ్చ మచ్చ రా’ అనే చోట మంచి హై వస్తుంది. చరణ్ చాలా ఎనర్జిటిక్ గా, స్టైలిష్..గా కనిపిస్తున్నాడు. డాన్స్ లో గ్రేస్ అదిరింది.1000 మందికి పైగా జానపద కళాకారులు ఈ పాటలో చరణ్‌తో కలిసి డాన్స్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
వాళ్ళు ఇండియాకి చెందిన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు కావడం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి.సంగీత దర్శకుడు తమన్ అందించిన బీట్ బాగుంది. తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాసిన ఈ పాటని నకాష్ అజీజ్ పాడిన విధానం ఆకట్టుకుంది. మీరు కూడా ఒకసారి చూస్తూ వినేయండి :