బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

సినీ పరిశ్రమ ఎక్కువగా సక్సెస్ ఉన్నవారి చుట్టూనే తిరుగుతుంటుంది. సక్సెస్ లేని వారిని పట్టించుకోదు. సక్సెస్ కొడతామని ముందుకొచ్చిన వారిని ప్రోత్సహించదు. ఇక్కడ డైరెక్షన్ ఛాన్స్ కోసం కృష్ణానగర్లో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవారి లెక్క వేలల్లో ఉంది. డైరెక్టర్ గా అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. డైరెక్షన్ ఛాన్స్ వచ్చినా.. ఆ సినిమా పూర్తవుతుందా? మధ్యలో ఆగిపోతుందా? షూటింగ్ పూర్తిచేసుకున్నా.. రిలీజ్ అవుతుందా? అంటూ చాలా లెక్కలు ఉంటాయి.

Janakiram Marella

ఆ టెన్షన్లన్నీ దాటి సినిమాని బయటకు తెచ్చినా.. అది బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులన్నిటినీ దాటేసి సక్సెస్ కొట్టాడు నూతన దర్శకుడు జానకిరామ్(Janakiram Marella).ఇటీవల వచ్చిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు జానకిరామ్ మారెళ్ళ. అక్టోబర్ 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘ఆదర్శ కుటుంబం’ వంటి పెద్ద సినిమా వెనక్కి వెళ్లడం వల్ల.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ కి చాలా అడ్వాంటేజ్ చేకూరింది.

రిలీజ్ కి ఎంత అడ్వాంటేజ్ చేకూరినా సినిమాలో మేటర్ లేకపోతే.. ఆడియన్స్ ఏమాత్రం పట్టించుకోరు. అందులోనూ ‘కామ్రేడ్ కళ్యాణ్’ నక్సలిజం బ్యాక్ డ్రాప్లో వచ్చిన సినిమా. నక్సలిజం బ్యాక్ డ్రాప్లో తెలుగులో వచ్చిన సినిమాలు 90 శాతం ఫెయిల్ అయ్యాయి. దీంతో ‘కామ్రేడ్ కళ్యాణ్’ పై మొదటి నుండీ చాలా అనుమానాలు ఏర్పడ్డాయి. నక్సలిజం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ కూడా.! అలాంటి పాయింట్ చుట్టూ కామిడీ అల్లడం అనేది కూడా కత్తిమీద సామే.

అయినప్పటికీ రెండిటినీ చాలా బ్యాలెన్స్ చేస్తూ తన టేకింగ్ తో ఎంటర్టైన్ చేయగలిగాడు జానకి రామ్. ‘విష్ణు విన్యాసం’ ‘మృత్యుంజయ్’ వంటి 2 ప్లాపులతో డీలా పడ్డ శ్రీవిష్ణుకి, హిట్టు మొహం చూసి చాలా కాలం అయిన రైటర్ కమ్ నిర్మాణ భాగస్వామి కోన వెంకట్ కి.. ఓ డీసెంట్ హిట్ అందించగలిగాడు. అందుకే జానకి రామ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇదిలా ఉంటే… స్టార్ డైరెక్టర్ బాబీకి జానకి రామ్ శిష్యుడు అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.

బాబీ తెరకెక్కించిన ‘పవర్’ ‘జై లవ కుశ’ వంటి సినిమాలకి స్క్రీన్ ప్లే రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు జానకి రామ్. తన గురువులానే కామిడీని, ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ ‘కామ్రేడ్ కళ్యాణ్’ ని తెరకెక్కించాడు. నిర్మాతలకి, బయ్యర్స్ కి ఇది సేఫ్ వెంచర్ అయ్యింది. అందుకే జానకి రామ్ కి టాలీవుడ్లోని పలు పెద్ద నిర్మాణ సంస్థల నుండీ అడ్వాన్సులు అందాయట. పలువురు మిడ్ రేంజ్ హీరోలు కూడా జానకి రామ్ ను పిలిపించుకుని కథలు వింటున్నట్టు సమాచారం. సక్సెస్ అందించే వాల్యూ అలాంటిది మరి..!

‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus