మాస్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటికి సాటిలేరెవ్వరు. స్టార్ హీరోలతో వరుస సినిమాలను రూపొందిస్తూ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. అదే ఊపులో తన తదుపరి సినిమాపై కసరత్తులు మొదలుపెట్టారు బోయపాటి. ఈ క్రమంలో ఆయన రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. ‘అఖండ’ హిట్ తరువాత బోయపాటి డిమాండ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది.
హీరోని మించి రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఆయన ఎదిగారట. ఆయన తదుపరి సినిమా విషయంలో ఇదే జరగబోతుందని సమాచారం. బాలయ్య బాబుతో కలిసి ‘అఖండ’ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. అయితే ప్రస్తుతం బాలకృష్ణ బిజీగా ఉండడంతో ఆయన ఫ్రీ అయ్యేలోపు మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు బోయపాటి. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కోసం ఓ కథను సిద్ధం చేసిన ఆయన ఈ సినిమాకి రామ్ ని మించి రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట.
ఈ సినిమాకి గాను హీరో రామ్ రూ.9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని.. అయితే దర్శకుడు బోయపాటి మాత్రం అంతకుమించి రూ.3 కోట్లు అదనంగా అంటే రూ.12 కోట్లు అందుకుంటున్నారట. హీరోని మించి డైరెక్టర్ రెమ్యునరేషన్ తీసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!