‘వినయ విధేయ రామా’ బోయపాటి శ్రీనుకి పెద్ద గుణపాఠమే ..!

హీరోని మాస్ గా చూపించడంలో రాజమౌళి, వినాయక్ లనే బోయపాటి కూడా సిద్దహస్తుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో ఇంట్రొడక్షన్ కి ఓ ఫైట్, ఇంటర్వెల్ దగ్గర ఓ భారీ ఫైట్, ఇక చివర్లో హీరోతో విలన్ తలకాయ నరికించడం… ఇదంతా బోయపాటి రెగ్యూలర్ ఫార్మాట్ అనే చెప్పొచ్చు. అయినప్పటికీ మాస్ ఆడియన్స్ కి బోయపాటి సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. కథ కొత్తగా లేకపోయినా హీరోతో ఫైట్లు.. డైలాగులు చేయిస్తూ హిట్లు కొట్టేసేవాడు. అయితే ‘వినయ విధేయ రామా’ చిత్రంతో ఆ మాస్ జనాన్ని కూడా బయపెట్టేసాడనే చెప్పాలి. చరణ్ క్రేజ్ పుణ్యమా అని భారీ నష్టాలనుండీ తప్పించుకున్నా… బోయపాటి శ్రీను కి మాత్రం విమర్శలు తప్పలేదు.

అందులోనూ తన మేకింగ్ స్టైల్ పై కొత్తగా చర్చ జరుగుతుంది. ఈ ప్రకారం బోయపాటి శ్రీనుకి సెట్ లో ఎప్పుడూ ఎంచుకున్న నటీనటులు ఉండి తీరాలట… పాలనా రోజు వాళ్ళకు సీన్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సెట్లో ఉండి తీరాలనే కండిషన్ పెట్టి మరీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటాడట.ఎందుకంటే .. మూడ్ ని బట్టి ఎప్పుడు ఏ సీన్ తీయాలో.. అనేది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని స్పాట్ లోనే వాళ్ళకు మొత్తం వివరించి తీసేస్తాడని టాక్. ఇలా ఒక్కో సినిమాకి ఆర్టిస్ట్ లని, టెక్నిషియన్లని ఇబ్బంది పెడుతుంటాడనే వార్తలు బయటకి రావడం గమనార్హం. గతంలో దేవీ శ్రీ ప్రసాద్ డైరెక్ట్ గా బోయపాటికి రివర్స్ కౌంటర్ వేసాడు. అయితే ఆర్టిస్టులు ఇలా రివర్స్ అవలేరు కదా. ‘వినయ విధేయ రామా’ లో అవసరం లేకపోయినా చాలా మంది ఆర్టిస్టులను తీసుకున్నాడు. వాళ్ళని స్క్రీన్ పై ఒక షో కోసం పెట్టాడనే ఫీలింగ్ వస్తుందనడంలో సందేహం లేదు. రాంచరణ్ కి నలుగురు అన్నయ్యలు ఎందుకు ఉన్నారో నిజంగా అర్థం కాదు. ఆర్యన్ రాజేష్-రవి వర్మ-మధు నందన్ వీళ్ళు కేవలం డమ్మీలుగా ఉన్నారు అనే కామెంట్స్ వచ్చాయి. జీన్స్ ప్రశాంత్ పాత్ర తప్ప మిగిలిన వారికి పెద్దగా స్కోప్ లేదు. ఏదో బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. ఇక పై బోయపాటి ఇంతమంది ఆర్టిస్టుల పై ఫోకస్ పెట్టడం మాని… కథ, కథనాల పై ఫోకస్ పెడితే మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus