ప్రముఖ హీరోయిన్ పై దర్శకుడు పిర్యాదు!

  • September 23, 2017 / 10:23 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ తో పాటు, వరుసగా మంచి సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్న హీరోయిన లావణ్య త్రిపాటి. ఈ భామా చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ మంచి హిట్ సినిమాలే చేసింది. చిన్న హీరోలకే కాదు, సాక్షాత్తూ నాగార్జునతో కూడా నటించిన ఈ బ్యూటీపై తమిళ దర్శకుడు ఒకరు కంప్లేంట్ చేశారు…ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు? ఎందుకు ఈ కంప్లేంట్ అంటే…తెలుగులో సూపర్ హిట్టయిన ‘100% లవ్’ మంచి విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంలో సుకుమార్ శిష్యుడు చంద్రమౌళి రీమేక్ చేస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా 100% కాదల్ పేరుతో తమిళంలో తెరకెక్కించనున్నాడు. ఇందులో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసి లండన్ లో షూటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, సడన్ గా ఆమె ఈ సినిమా తాను చెయ్యలేను అని తనని ఈ సినిమా నుంచి తొలగించమని చెప్పిందట. ఇక ఈ న్యూస్ వినగానే కోపంతో ఊగిపోయిన దర్శకుడు చంద్రమౌళి, తమ హీరోయిన్ లావణ్య, తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందన్నదని దీని వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందంటూ దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో పిర్యాదు చేశారట. లావణ్య బాధ్యతారాహిత్యంతో నష్టపోయామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాదు లావణ్య స్థానంలో అర్జున్ రెడ్డి భామ షాలిని పాండేని కథానాయికగా ఎంపిక చేసినట్టు సైతం తెలిపారు…మొత్తంగా చూసుకుంటే అసలు లావణ్య తప్పుకోవడానికి కారణాలు అయితే తెలీదు కానీ…ఈ సినిమా మాత్రం ఆమె మిస్ చేసుకుంది అనే చెప్పాలి…ఎందుకంటే ఈ సినిమా తెలుగులో ఒక రకంగా తమన్నా కరియర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది…తమిళంలో లావణ్య చేసి అక్కడ కూడా మంచి హిట్ అయ్యి ఉంటే ఆమె కూడా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరి పోయేది…పాపం లావణ్య

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus