డైరెక్టర్ ను వెంట తిప్పించుకొంటున్న సాయిపల్లవి

Advertisement

ఒక్కోసారి కొందరు దర్శకులకు కథ నచ్చలేదు అని చెప్పుకోలేక ఇంకొన్నిసార్లు నచ్చిన కథను డేట్స్ ఇష్యూస్ కారణంగా వదులుకోలేక హీరోయిన్లు దర్శకులను తమ వెంట తిప్పించుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా సర్వసాధారణంగా జరిగే విషయం. సాధారణంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు మాత్రమే ఇలా చేస్తుంటారు. కానీ.. ఈ పద్ధతిని సాయిపల్లవి కూడా ఫాలో అవుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళంలో “కణం, మారి2, ఎన్.జి.కె” సినిమాలతో వరుస ఫ్లాపులు చవి చూసిన సాయిపల్లవి ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల మీద కాన్సన్ ట్రేట్ చేసింది. తెలుగులో నాగచైతన్యతో ఒక సినిమా, రాణాతో ఒక సినిమా చేస్తున్న సాయిపల్లవి.. మలయాళంలోనూ ఒక సినిమా సైన్ చేసింది.

అయితే.. తమిళ పరిశ్రమ నుంచి రామకృష్ణన్ అనే యువ దర్శకుడు సాయిపల్లవికి ఒక మంచి కథ చెప్పాడు. ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ బాగా నచ్చింది, త్వరలోనే డేట్స్ ఎప్పుడు ఖాళీ ఉన్నాయి అనేది చెప్తాను అని సాయి పల్లవి చెప్పి ఇప్పటికే కొన్ని నెలలు అయిపోయిందట. దాంతో.. నచ్చితే నచ్చింది అని చెప్పాలి.. లేదంటే లేదని చెప్పాలి కానీ.. ఇలా తిప్పించుకోవడం మాత్రం అస్సలు బాలేదు అని ఆ దర్శకుడు కొందరు ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర తన కోపాన్ని వెళ్ళగక్కాడు. మరి సాయిపల్లవి ఇలా తిప్పిణ్చుకోవడం అనేది నిజంగానే బాగోలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus