Harish Shankar: ఇంటర్వ్యూ: ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ ఆసక్తికర విషయాలు.!

  • August 13, 2024 / 08:37 PM IST

‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)  మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని హీరో రవితేజ కంటే ఎక్కువగా దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీకోసం :

Harish Shankar

ప్రశ్న) మీ ప్రతి సినిమాలో హీరో రోల్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ‘మిస్టర్ బచ్చన్’ లో హీరో క్యారెక్టరైజేషన్ కోసం మీరు చేసిన హోమ్ వర్క్ ఏంటి?

హరీష్ శంకర్ : రైడ్ లో హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) క్యారెక్టరైజేషన్ కి .. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫన్ అది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

ప్రశ్న) ఈ సినిమాలో రవితేజ గారి పాత్ర ఎలా ఉంటుంది?

హరీష్ శంకర్ : నార్త్ లో జరిగిన ఓ యధార్థ కథ ఇది. మన సినిమాలో.. 1985 – 1990…లలో జరిగినట్టు చూపిస్తున్నాం. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి చెందిన ఓ నిజాయితీ పరుడైన హీరో.. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పనిచేస్తే ఎలా ఉంటుంది. అనేది ఈ సినిమాలో చూడబోతున్నాం.

ప్రశ్న) ‘ఈ మధ్య స్మగ్లర్..లను, రౌడీలను హీరోలుగా చూపిస్తున్నారు కొన్ని సినిమాల్లో’ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  గారు అన్నారు.. దాని పై మీరు ఏం అంటున్నారు?

హరీష్ శంకర్ : ఆయన బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నారు. కాబట్టి ఆయన అలా మాట్లాడారు. అలా అని ‘పుష్ప’ (Pushpa) సినిమాలో హీరో గొడ్డలి పట్టుకున్నాడు కదా అని.. ఆ సినిమాలు చూసే సాఫ్ట్-వేర్ బ్యాచ్ ల్యాప్ టాప్..లు పక్కన పెట్టి గొడ్డళ్లు పట్టుకోలేదు కదా..? సినిమా వల్ల ప్రేక్షకులు ప్రభావితం అవుతారు అనేది అపోహ.

ప్రశ్న) ‘రైడ్’ కి ‘మిస్టర్ బచ్చన్’ కి టేకింగ్ పరంగా ఎలాంటి మార్పులు ఉంటాయి?

హరీష్ శంకర్: ‘రైడ్’ లో హీరో, హీరోయిన్లకి పెళ్లి అయిపోతుంది. తర్వాత స్టార్టింగ్లోనే ఇంట్లోకి వెళ్తారు. రైడ్ మొదలవుతుంది. కానీ ‘మిస్టర్ బచ్చన్’ లో హీరో, హీరోయిన్లకి పెళ్లి అవ్వదు. ప్రేమలో ఉంటారు. ఇంటర్వెల్ కి హీరో రైడ్ చేయాల్సిన ఇంట్లోకి వెళ్తాడు.

ప్రశ్న) ఈ సినిమాకి బజ్ తీసుకొచ్చింది మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) . అతను క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ అని అంతా అనుకుంటారు?అతని నుండి మీరు మాస్ మ్యూజిక్ ఎలా తీసుకోగలుగుతున్నారు?

హరీష్ శంకర్ : ‘గద్దలకొండ గణేష్’ కి(Gaddalakonda Ganesh) మంచి ఆడియో ఇచ్చాడు. అయితే ‘జర్రా జర్రా’ మంచి హిట్ అయ్యింది. అతను ఓ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని నా ఫీలింగ్. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకి మిక్కీ వారం రోజుల్లో ట్యూన్లు ఇచ్చేశాడు. ఈరోజుల్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలా ఇవ్వలేకపోతున్నారు. అతని స్టార్ డైరెక్టర్స్ కనుక ఛాన్స్ ఇస్తే.. ఇంకా బెస్ట్ వర్క్ బయటకి వస్తుందనేది నా ఫీలింగ్.

ప్రశ్న) మీకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందని అంతా అంటుంటారు. ముఖ్యంగా మీ సినిమాల్లోని పాటల్లో.. లిరిక్స్ చాలా బాగుంటాయి? ప్రతిసారి మంచి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది?

హరీష్ శంకర్ : నాకు మా నాన్నగారి వల్ల సాహిత్యంపై పట్టు ఉంది. అలాగే అనుక్షణం మ్యూజిక్ ని నేను ఎంజాయ్ చేస్తుంటా. అయితే బాధల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ అనేది స్ట్రెస్ బస్టర్. ఆ టైంలో ఎక్కువగా నా ఫోకస్ లిరిక్స్ పై ఉంటుంది. నాకు తెలిసి ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తే లిరిక్స్ శ్రద్దగా వింటారు అని నేను అనుకుంటాను.

ప్రశ్న) మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో… రవితేజ గారికే ఎక్కువ రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ పెట్టారు కారణం?

హరీష్ శంకర్ : ఏవండీ..! పవన్ కళ్యాణ్ గారికి బాగా సిగ్గు. ఆయన రొమాంటిక్ సీన్స్ లో కంఫర్ట్ గా నటించలేరు. రవితేజ అయితే ఎలాంటి సీన్స్ అయినా సిగ్గు పడకుండా చేస్తారు.

ప్రశ్న) ‘పకోడీగాళ్లు’ వంటి డైలాగులు ట్విట్టర్లో ట్రోల్ చేసే వాళ్ళ కోసమే పెట్టారా?

హరీష్ శంకర్ : లేదు అండి..! ట్విట్టర్ కంటే ఇప్పుడు ఇన్స్టా ఫేమస్, పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే ఫేస్బుక్ చూస్తున్నారు. కానీ నా ఇంటెన్షన్ వాళ్ళు మాత్రమే కాదు. అరుగులు మీద కూర్చొని కూడా రకరకాలుగా పక్కోళ్ల గురించి మాట్లాడుకుంటారు. పక్క వాళ్ళ లైఫ్ పై ఏదోక నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి.

ప్రశ్న) ‘రైడ్’ కి దీనికి ‘మిస్టర్ బచ్చన్’ కి చాలా మార్పులు ఉన్నాయి అన్నారు. మరి ఒరిజినల్ డిస్టర్బ్ అవుతుంది అనే ఆలోచన మీకు రాలేదా?

హరీష్ శంకర్ : ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh)  లో కబడ్డీ సీక్వెన్స్, అంత్యాక్షరి ఎపిసోడ్ వంటివి ఒరిజినల్లో ఉండవు. అయినా సరే ఒరిజినల్ డిస్టర్బ్ అయ్యింది అనే ఫీలింగ్ ఎవ్వరికీ కలగలేదు. ఇది కూడా అంతే..!

ప్రశ్న) ఇంత ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ అవ్వడానికి నిర్మాత సపోర్ట్ ఎంతవరకు ఉంది?

హరీష్ శంకర్ : మార్కెట్, బడ్జెట్ లెక్కలు వంటివి పట్టించుకోకుండా నిర్మాత విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) గారు ఈ సినిమాకి ఖర్చు పెట్టారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా తీయగలిగాను.

ప్రశ్న) ఫైనల్ గా ‘మిస్టర్ బచ్చన్’ గురించి ప్రేక్షకులకి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు?

హరీష్ శంకర్ : ఆగస్టు 15న కాదు ఆగస్టు 14నే ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్స్ పడుతున్నాయి. రిపీట్స్ లో చూడదగ్గ సినిమా ఇది.

ఇదేం వార్నింగ్ హరీష్ శంకర్ గారూ..!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus