ఈమధ్యకాలంలో పాజిటీవో, నెగిటివో హరీష్ శంకర్ (Harish Shankar) గురించి మాట్లాడుకున్నంతలా మరో దర్శకుడి గురించి సోషల్ మీడియా కానీ ఇండస్ట్రీ వర్గాలు కానీ చర్చించుకోలేదు. అందుకు కారణాలు కోకొల్లలు అయినప్పటికీ.. ఈ అటెన్షన్ ను మాత్రం హరీష్ బాగా ఎంజాయ్ చేశాడు. అయితే.. నిన్నటినుండి హరీష్ శంకర్ మరో విషయానికి ట్రెండ్ అవుతున్నాడు, ఆ ట్రెండ్ మెగా అభిమానులను ఓ మోస్తరుగా కలవరపెట్టిందనే చెప్పాలి. ఆచార్య (Acharya) సినిమా టైమ్ కి హరీష్ శంకర్ & చిరంజీవి (Chiranjeevi) మధ్య జరిగిన సంభాషణ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు,
అలాగే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తారనే వార్త కూడా హల్ చల్ చేసింది. ఈ వార్త నిన్న నిజం అయ్యింది కూడా. అయితే.. అది ఒక యాడ్ కోసం అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. “కంట్రీ డిలైట్” అనే మిల్క్ బ్రాండ్ కోసం చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో నిన్న ఒక యాడ్ షూట్ జరిగింది. స్టూడియో సెట్లో జరిగిన ఈ షూటింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
అదే సమయంలో హరీష్ శంకర్-రామ్ (Ram) కాబినేషన్ లో మొదలవ్వాల్సిన సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు కాస్త కంగారు పడ్డారు కానీ.. విషయం తెలిశాక సైలెంట్ అయ్యారు. ఒక కమర్షియల్ డైరెక్టర్ గా స్థాయి కానీ సత్తాను గానీ అంతలా తీసిపారేయడానికి లేదు.
అయితే.. “మిస్టర్ బచ్చన్” (Mr Bachchan) తరహాలో ఇంకో రెండు సినిమాలు పడితే మాత్రం షెడ్డుకు వెళ్లిపోవాల్సిందే. కానీ.. ఈ పరాజయం నుండి తప్పులను తెలుసుకొని తన తదుపరి చిత్రంలో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి.. నిజంగానే చిరంజీవిని డైరెక్ట్ చేయగలిగే ఆఫర్ ను దక్కించుకొని.. తనను వేలెత్తి చూపినవాళ్లందరికీ సరైన సమాధానం చెప్తాడేమో చూద్దాం!