టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా వినాయక్ (VV Vinayak) దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన దిల్, ఆది (Aadi) , ఠాగూర్ (Tagore) , చెన్నకేశవరెడ్డి (Chennakesava Reddy) , కృష్ణ (Krishna) , అదుర్స్ (Adhurs) , అల్లుడు శీను (Alludu Seenu) మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఖైదీ నంబర్ 150 (Khaidi No. 150) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న వినాయక్ ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో బాక్సాఫీస్ రేస్ లో వెనుకబడ్డారు.
అయితే వినాయక్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక్ కు మేజర్ లివర్ సర్జరీ జరిగిందని హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారని సమాచారం అందుతోంది. ఎల్బీ నగర్ లో ఉన్న ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స జరిగిందని వినాయక్ కోలుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన కోకాపేట్ లో ఉన్న అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నారని భోగట్టా. అయితే సర్జరీకి సంబంధించిన వార్తల గురించి స్పష్టత రావాల్సి ఉంది. ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడం వినాయక్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. ఈ సినిమాకు చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే. వినాయక్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.
అయితే గతంతో పోల్చి చూస్తే వినాయక్ రెమ్యునరేషన్ మాత్రం కొంతమేర తగ్గిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వినాయక్ కు సర్జరీ అంటూ వార్తలు ప్రచారంలోకి రావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. స్టార్ హీరోలు డేట్స్ ఇస్తే వినాయక్ ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం ఖాయమని చెప్పవచ్చు. వినాయక్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడాల్సి ఉంది. వినాయక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.