తల్లి చనిపోయినా.. అలీని ఓదార్చడానికి పవన్ ఎందుకు వెళ్ళనట్టు?

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ తల్లి జైతున్ బీబీ ఇటీవల.. (గురువారం నాడు) మరణించిన సంగతి తెలిసిందే. తన తల్లి అంటే ఎంతో ప్రేమని.. ఆవిడ గొప్పతనాన్ని కూడా పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు అలీ. ఇలాంటి పరిస్థితుల్లో అలీని ఓదార్చడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అందరూ అతని నివాసానికి వచ్చి వెళ్ళారు. అలీ తల్లి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి పెద్దలు కూడా హాజరయ్యారు. అయితే అలీకి బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. ఈ విషయం పై పవన్ ను చాలా మంది ట్రోల్ చేస్తూ వచ్చారు. ‘రాజకీయ మనస్పర్థలు వల్లే పవన్ రాలేదు’ అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇలాంటి కామెంట్స్ సరికాదు అంటూ సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు ఇమంది రామారావు ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్.. అలీ ఇంటికి వెళ్ళలేదు అన్న విషయం చాలా చిన్నది. కావాలని ఆ విషయాన్ని పెద్దది చేస్తున్నారు. పవన్ వెళ్తే గనుక.. ఆయన్ని చూడగానే అలీ బోరున ఏడ్చేస్తాడు. పవన్ కూడా ఎమోషనల్ అయిపోతాడు. వారి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. తన తల్లి చనిపోయినా పవన్ ఎందుకు రాలేదో.. అలీ కూడా అర్థం చేసుకోగలడు. అలీ ప్రత్యేకమైన స్నేహితుడని పవన్ చాలా సందర్భాల్లో చెప్పారు. చిరంజీవి.. అలీని పరామర్శించారు కాబట్టి పవన్ ఎందుకు వెళ్ళలేదు అనే విషయాన్నే హైలైట్ చేస్తున్నారు. చిరంజీవిగారు ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తి కాబట్టి పెద్ద మనిషిగా వెళ్ళారు. ఇక్కడ పవన్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus