స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ.. ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయన ప్రతీ సినిమాలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక అంశాన్ని విశ్లేషిస్తూ ఓ మెసేజ్ కూడా ఇస్తుంటారు. కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నప్పటికీ.. అందులో 60 శాతం సమాజ సేవకే ఖర్చుపెడుతుంటాడు ఈయన. ఇప్పటికీ సొంత ఇల్లు కొనుక్కోకుండా అద్దింట్లోనే ఉంటూ వస్తున్నాడు. తమకు పిల్లలు కూడా వద్దని.. ఓ అనాథను దత్తత తీసుకుని పెంచుకోవాలని కూడా కొరటాల శివ మరియు అతని భార్య అరవింద డిసైడ్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. వ్యక్తిగతంగా ఎంతో కూల్ గా ఉండే కొరటాలకు ఇప్పుడు ఓ విషయంలో చాలా కోపం వచ్చింది.
ఇప్పుడు రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్న కొరటాల.. దీనికి గల కారణాల్ని వివరిస్తూ మండిపడ్డాడు. ‘కరోనా వైరస్ సోకిందని తెలిసి కూడా కొందరు … సమాజంలో ఇష్టమొచ్చినట్టు తిరిగేస్తూ మిగిలిన వారికి అంటించేసి వారి ప్రాణాల్ని తీసేస్తున్నారు.ఇలాంటి వాళ్ళు వైరస్ కంటే కూడా డేంజర్. దీని విషయంలో చాలా రెస్పాన్సిబుల్ గా ఆలోచించాలి. బాధ్యతగా ప్రవర్తించాలి’ అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు.