కొరటాల శివ (Koratala Siva) .. అప్పటివరకు రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ అంటూ లేని దర్శకుడిగా ఇతని పేరు చెప్పుకునే వారు. కానీ ‘ఆచార్య’ (Acharya) ఆ ఒపీనియన్..ని మార్చేసింది. 4 బ్లాక్ బస్టర్లు కొరటాల శివ అందించాడు అనే నిజాన్ని కూడా కప్పేసింది ‘ఆచార్య’ చిత్రం. ఇప్పుడు మళ్ళీ తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి. కొరటాల నుండి ‘దేవర’ (Devara) వస్తోంది.కొరటాల తిరిగి తన ఫామ్ అందుకోవడానికి ఇది మంచి అవకాశం. అయితే కొరటాల శివ సినిమాల్లో ఓ బలమైన సోషల్ మెసేజ్ ఉంటుంది.
అది మిస్ అవ్వడం వల్లే అనుకుంట ‘ఆచార్య’ ఫలితం తారుమారు అయ్యింది. ‘దేవర’ విషయంలో అది మిస్ కాకుండా కొరటాల చేసుకున్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. మరోపక్క కొరటాల సినిమాలు.. టైటిల్స్ తోనే సగం కథ రివీల్ అయిపోతూ ఉంటాయి.ఇక ట్రైలర్స్ చూస్తే కథ కంప్లీట్ గా అర్థమైపోతుంది.ఆ తర్వాత స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ కనిపిస్తుంది.
అయితే ‘దేవర’ కథ ఏంటి అనేదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఎవరికి తోచింది వారు చెప్పుకుంటున్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్..ను ఆధారం చేసుకుని కొరటాల ‘దేవర’ కథ రాసుకున్నట్టు అంతా చెప్పుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. దీంతో అయినా ‘దేవర’ కథపై ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ బాలీవుడ్ నుండి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి హిందీ మార్కెట్ చాలా ముఖ్యమైపోయింది. ఓవర్సీస్లో ‘దేవర’ ఆల్రెడీ 1 మిలియన్ మార్క్ ను దాటేసిన సంగతి కూడా తెలిసిందే.