ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై తుది నిర్ణయం ఇదే

నందమూరి తారకరామారావు బయోపిక్ మూవీ ప్రారంభం నుంచి అనేక మార్పులు జరిగాయి. తేజ ప్రాజక్ట్ నుంచి బయటికి వెళ్లడం.. క్రిష్ ప్రాజక్ట్ ని అందుకోవడం తర్వాత… స్క్రిప్ట్ లో మార్పులతో పాటు.. పాత్రలను సైతం తనకి నచ్చిన వారిని క్రిష్ ఎంపిక చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా లైఫ్, పొలిటికల్ లైఫ్ ని మూడు గంటల్లో చెప్పడం కష్టమని.. రెండు భాగాలుగా తీద్దామని బాలకృష్ణకి డైరక్టర్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. బాలయ్యకి రెండు భాగాలుగా తీయడం ఇష్టం లేదు. మహానటి సినిమా మాదిరిగానే తీయాలని సూచించారు. ఈ విషయం వల్ల ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా మాటలు కరువయ్యాయి.

చివరకి క్రిష్ బాలయ్య చెప్పినట్టుగానే చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్ ఒకే భాగంగా రానుంది. ఇందులో బసవతారం రోల్ ని విద్యాబాలన్, చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషించనున్నారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి, విష్ణువర్థన్‌ ఇందూరిలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల ఐదవ తేదీ నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తొందరగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus