క్రిష్ విడాకులు కోరడానికి కారణం ఏమిటి ?

సమాజాన్ని ఉన్నది ఉన్నట్టు వెండితెరపై ఆవిష్కరించడానికి ఇష్టపడే డైరక్టర్ క్రిష్.అతని ప్రత్యేకమైన కథల ఎంపికే అతన్ని తెలుగు టాప్ దర్శకుల్లో ఒకరిని చేసింది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగు పూర్వవైభవాన్ని, ప్రతాపాన్ని ప్రపంచానికి చాటిన ఈ డైరక్టర్ వ్యక్తిగత జీవితం స్వయంగా లేనట్టు తెలిసింది.2016 ఆగష్టులో క్రిష్ హైదరాబాద్ కి చెందిన వైద్యురాలు రమ్యని పెళ్లి చేసుకున్నారు. ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగారు. అదే వృత్తి పరమైన ఒత్తిళ్లు వారి మధ్య చిచ్చు పెట్టినట్లు సమాచారం. క్రిష్ పెళ్లి సమయంలో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

అయినా రమ్య అర్ధం చేసుకుని క్రిష్ కి అండగా నిలిచారు. ఆ తర్వాత క్రిష్ కి బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ చేతికి వచ్చింది. కంగనా రనౌత్ తో మణికర్ణిక అనే త్రిభిషా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో మునిగిపోయారు. ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అద్భుతంగా మలచాలని తపనతో జీవిత భాగస్వామి రమ్యకి సమయాన్ని కేటాయించడాన్ని తగ్గించారు. సో ఇద్దరి మధ్య దూరం పెరిగి విడాకులు వరకు వెళ్లారు. ఇద్దరూ తమకి విడాకులు కావాలని కోర్టుని అశ్రయించినట్టు ఫిలిం నగరవాసులు చెప్పారు.ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో క్రిష్ స్పందిస్తే తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus