వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొండపొలం సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రముఖ రచయితలలో ఒకరైన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి కొండపొలం నవలను రచించారు. కొండపొలం సినిమా కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో దర్శకుడు రచయితకు క్రెడిట్ ఇవ్వడంతో పాటు ఆయన పేరు పోస్టర్ పై ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.
సాధారణంగా స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల కథల విషయంలో ఇతరులకు క్రెడిట్ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడరు. గతంలో కొంతమంది డైరెక్టర్లు రచయితలకు క్రెడిట్ ఇవ్వకుండా సినిమాలను తెరకెక్కించిన సంఘటనలు ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘అఆ’ సినిమా మీనా అనే నవల ఆధారంగా తెరకెక్కింది. అయితే టైటిల్ కార్డ్స్ లో మాత్రం యద్దనపూడి సులోచనారాణికి త్రివిక్రమ్ క్రెడిట్ ఇవ్వకపోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ యద్దనపూడి సులోచనారాణి పేరు వేయకపోవడానికి టెక్నికల్ రీజన్స్ ను కారణంగా చూపారు.
అయితే క్రిష్ మాత్రం కొండపొలం నవల రాసిన రచయితకు క్రెడిట్ ఇస్తూ గొప్పదనాన్ని చాటుకున్నారు. కొండపొలం సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసిన క్రిష్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో హరిహర వీరమల్లు సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!