Director Maruthi,Chiranjeevi: చిరుతో కామెడీ సినిమా ప్లాన్ చేస్తోన్న మారుతి!

  • November 5, 2021 / 08:44 AM IST

దర్శకుడు మారుతి చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకున్నాడు. ‘భలే భలే మగాడివోయ్’, మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. అయితే తన కెరీర్ లో స్టార్ హీరోలతో కలిసి పని చేసే ఛాన్స్ మాత్రం మారుతికి రాలేదు. కానీ త్వరలోనే ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తానని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ.. చాలా మంది దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు.

ఆ లిస్ట్ లో ఇప్పుడు మారుతి కూడా చేరిపోయారు. ఇప్పటికే చిరంజీవి.. కొరటాల శివ, మోహన్ రాజా, బాబీ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మారుతి దర్శకత్వంలో కూడా ఓ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుండడం ఇంట్రెస్టింగ్ టాపిక్. నిజానికి మారుతి దర్శకత్వంలో చిరు సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించిన మారుతి.. చిరుతో త్వరలోనే సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఇటీవలే చిరంజీవి గారిని కలిసి ఓ లైన్ చెప్పానని..

అది ఆయనకు బాగా నచ్చిందని.. దానిని డెవలప్ చేయాలని.. తన మార్క్ కామెడీతో, చిరు కామెడీ టైమింగ్ తో హిలేరియస్ గా ఉండబోతుందని మారుతి తెలిపారు. ప్రస్తుతం ఆయన చిరు సినిమా కథపై కసరత్తులు చేస్తున్నారని సమాచారం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus