Maruthi: ‘ది రాజా సాబ్‌’ పుకార్లు వింటే కంగారొస్తోంది.. కానీ ఆయన మాత్రం..!

ఓ సినిమా మూడేళ్ల నుండి సెట్స్‌లో ఉంది. అప్పుడెప్పుడో నెలల క్రితం షూటింగ్‌ జరిగి మళ్లీ హీరో అటువైపే ముఖం చూపించడం లేదు అంటూ ఎవరికైనా కచ్చితంగా అనుమానం ఉంటుంది. అందులోనూ ఆ హీరో ఏ కొత్త సినిమా ఓకే చేయడం లేదా అంటూ చేస్తున్నాడు అనే చెప్పాలి. సినిమా షూటింగ్‌లకు రావడం లేదా అంటే ఆ షూటింగ్‌లకు వెళ్తున్నాడు అనే చెప్పాలి. కానీ మూడేళ్ల క్రితం నాటి సినిమా అలానే ఉంది. ఆ హీరో ప్రభాస్‌ (Prabhas), ఆ సినిమా ‘ది రాజా సాబ్‌’ (The Rajasaab) .

Maruthi

‘ది రాజా సాబ్‌’ సినిమా గురించి గత కొన్ని నెలలుగా రకరకాల పుకార్లు వస్తున్నాయి. అవుట్‌పుట్‌ విషయంలో టీమ్‌ సంతృప్తిగా లేదని, బడ్జెట్‌ విషయంలో నిర్మాత గుర్రుగా ఉన్నారని ఇలా చాలా మాటలు వస్తున్నాయి. అన్నట్లు ఈ సినిమా నిర్మాత మారిన విషయం మీకు తెలిసే ఉంటుంది. పాతాయన డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఎందుకో కానీ కొత్త నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కి అమ్మేశారు. ఇవన్నీ ఉండగా సినిమా విషయలో నమ్మకం పెట్టుకోండి అంటున్నారు దర్శకుడు మారుతి (Maruthi Dasari) .

‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి దర్శకుడు మారుతి అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో ప్రభాస్‌ సినిమా గురించి చెప్పమని యాంకర్‌ అడగ్గా చాలా కాన్ఫిడెంట్‌గా స్పందించారు మారుతి. ప్రభాస్‌తో ఎలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందో.. అలాంటి సినిమానే తీస్తున్నా. అందుకే కంగారుపడకుండా ధైర్యంగా ఉంటే బెస్ట్‌ అవుట్‌పుట్‌ వస్తుంది అని అన్నారు మారుతి.

ఆయన చెప్పినట్లు కంగారు పడొద్దు అంటే నిర్మాత గతంలో చెప్పినట్లు ఈ పాటకు సినిమా వచ్చి ఉండాలి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో టీజీ విశ్వప్రసాద్‌ (T. G. Vishwa Prasad) మాట్లాడుతూ సంక్రాంతికి తీసుకొస్తాం అని చెప్పారు కానీ రాలేదు. ఆ తర్వాత సమ్మర్‌ అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే సమ్మర్‌లో కూడా ‘ది రాజా సాబ్‌’ దర్శనం అయ్యేలా లేదు.

విక్రమ్ సినిమా ఈవెనింగ్ షోలతో రిలీజ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus