అయోమయంలో మారుతీ కెరీర్…?

‘భలే భలే మగాడివోయ్’ ‘బాబు బంగారం’ ‘మహానుభావుడు’ ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి జబ్బు సినిమాలు తీస్తూ వచ్చిన దర్శకుడు మారుతీ.. గతేడాది చివర్లో ‘ప్రతీరోజూ పండగే’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మొత్తానికి రూటు మార్చాడు అని క్రిటిక్స్ కూడా ఇతని పై ప్రశంసలు కురిపించారు. ‘జిఏ2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం.. మెగా మేనల్లుడు సాయి తేజ్ కెరీర్లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే అంత పెద్ద హిట్టందుకుని కూడా దర్శకుడు మారుతీ ఖాళీగా ఉంటున్నాడు. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే మారుతీకి.. ఇప్పుడు ఒక్క హీరో కూడా అవకాశం ఇవ్వడానికి ఖాళీగా లేకపోవడం గమనార్హం. నాని,నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయి తేజ్, విజయ్ దేవరకొండ, శర్వానంద్.. ఇలా ఒక్క హీరో కూడా ఇప్పుడు ఖాళీగా లేడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చెయ్యాలని ప్రయత్నాలు చేసాడు. అది వర్కౌట్ అయినట్టుగా కనిపించినా.. తరువాత డిస్కషన్ స్టేజిలోనే ఆగిపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఖాళీగా లేడు. అల్లు శిరీష్ మాత్రమే ఖాళీగా ఉన్నాడు.

కానీ అతనితో సినిమా చెయ్యడానికి మారుతీ ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది.సుధీర్ బాబు, రాజ్ తరుణ్, ‘ఆర్.ఎక్స్.100’ కార్తీ కేయ కూడా ఖాళీగా లేకపోవడం మారుతీకి మరో షాక్ ఇచ్చింది. కాబట్టి ఈ ఖాళీ సమయాన్ని.. అల్లు అరవింద్ ‘ఆహా’ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థకు వెబ్ సిరీస్ కంటెంట్ కు కేటాయించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా.. మారుతీ కెరీర్ డైలమాలా పడింది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus