తక్కువ ఖర్చు పెట్టి.. ఎక్కువ వసూళ్లు సాధించడమెలా అనేది తెలిసిన దర్శకుల్లో మారుతి ఒకరు. చిన్న కథల్ని, చిన్న హీరోల్ని పెట్టే ఎక్కువ మొత్తంలో వసూళ్లు అందుకున్నారు. పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు కానీ, ఓ మోస్తరు హీరోలతో కూడా సినిమాలు తీసి విజయం అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా, స్నేహితులతో కలసి నిర్మాతగానూ తనదైన శైలిలో మెప్పించారు మారుతి. మరి ఆయన సినిమా టికెట్ ధరలపై ఏమనుంటారు. ఆసక్తికరంగా ఉంది కదా.
టాలీవుడ్‌లో సినిమా టికెట్ ధరల విషయంలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఆ విషయంలో మీరేమంటారు అని అడిగితే.. ‘‘సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎంత తీసుకోవచ్చన్నది అల్లు అరవింద్, బన్నీ వాస్ లాంటి నిర్మాతలకు తెలుసు. మేము అందుకు తగ్గట్లుగానే టికెట్ ధరలు తక్కువగానే ఉంచాం’’ అని చెప్పారు మారుతి. టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే సాధారణ మధ్య తరగతి వ్యక్తి కుటుంబంతో కలసి థియేటర్‌కు ఎందుకు వస్తాడు? అని అంటున్నారు మారుతి.
ఓటీటీ లాంటి ప్రత్యామ్నాయం ప్రేక్షకుడికి అందుబాటులో ఉన్నప్పుడు టికెట్ ధరని ఇంకా తక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పిన మారుతి.. వీటన్నింటిపై పరిశ్రమ పెద్దలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. టికెట్ ధరల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోతే సినీ పరిశ్రమ భవిష్యత్తులో కష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తుంది అని అంచనా వేశారు మారుతి. సినిమా టికెట్ ధరల విషయంలో సినీ పరిశ్రమ ఆలోచిస్తోంది అనేది మారుతి మాటల బట్టి తెలుస్తోంది.
ముందు చెప్పినట్లు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ అవుట్‌పుట్ ఎలా ఇస్తారు అనే విషయం ఆయన్నే అడిగితే… స్క్రిప్ట్‌ను పకడ్బందీగా సిద్ధం చేసుకొని, సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ముందే ఎడిట్ చేసుకోగలిగితే ఖర్చు చాలా తగ్గిపోతుందని చెప్పారు మారుతి. దాని వల్ల సమయం వృథా కాదు కూడా. స్క్రిప్ట్ దశలోనే రెండు నెలలు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే సరి అని అన్నారు మారుతి. కథ సిద్ధం చేసుకొని మిగతాది ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసుకుందాంలే అనుకుంటే చాలా సమయం, ధనం నష్టపోతాం అని చెప్పారు మారుతి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!