Maruthi: రాజసాబ్ తరువాత మారుతి ప్లాన్ ఏంటీ?

రాజసాబ్ (The Rajasaab) సినిమా ప్రభాస్  (Prabhas)  కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని రేకెత్తిస్తోంది. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, మారుతి దర్శకుడిగా తన స్థాయిని కొత్త లెవెల్‌కి తీసుకెళ్లనుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌తో మారుతి కాంబినేషన్ ప్రారంభంలో కొంత విమర్శలెదుర్కొన్నప్పటికీ, ఆ తరువాత వచ్చిన పోస్టర్స్, మోషన్ టీజర్ అన్నీ సినిమాపై బజ్ పెంచాయి. ఈ ప్రాజెక్ట్‌తో మారుతి పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Maruthi

రాజసాబ్ విజయం సాధిస్తే, మారుతి మరో స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun) కోసం మారుతి కథ సిద్ధం చేస్తూ ఉన్నారని టాక్ ఉంది. అయితే, రాజసాబ్ విడుదల తరువాత మారుతి తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించవచ్చు. మారుతి ప్రస్తుతం రాజసాబ్ చిత్రంపై పూర్తి దృష్టి పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత, ఆల్రెడీ లైన్‌లో ఉన్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రాజెక్ట్‌పై పని చేయాలని భావిస్తున్నాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించే అవకాశం ఉందని, అది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండనుందని సమాచారం. అయితే, అధికారిక క్లారిటీ రానప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మారుతి రాజసాబ్ చిత్రాన్ని ఒక తారాస్థాయిలో నిర్మిస్తుండటంతో, ఈ సినిమాకు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా, పాన్ ఇండియా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.

ఇది విజయం సాధిస్తే, మారుతి తన సినిమాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టే స్థాయికి ఎదగడం ఖాయం. అలాగే ఇతర స్టార్ హీరోలతో ప్రాజెక్టులు చేయడానికి మారుతి సిద్ధమయ్యే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్ చిత్రాలతో మొదలైన తన కెరీర్‌లో, ఇప్పుడు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి చేరుకోవడం ఒక గొప్ప రికార్డు. మరి రాజసాబ్ తర్వాత మారుతి ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటిస్తాడో చూడాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ సెకండ్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా చూసి ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus