సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు వస్తాయి. ఒకాయన ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడి అని చెప్పుకునే ఒకాయన రివ్యూ ఇస్తుంటాడు. దీనికి సెన్సార్ రివ్యూ ఒకటి యాడింగ్. ఇలాంటి రివ్యూలు ఇప్పటివరకు చూశాం. అయితే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక రివ్యూను సుకుమార్ (Sukumar) ఇచ్చేయగా, రెండో రివ్యూను చిరంజీవి (Chiranjeevi) ఇచ్చేశారు. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిన్న జరిగిన కటౌట్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పారు. రామ్‌చరన్, కియారా అడ్వాణీ (Kiara Advani) , అంజలి (Anjali) ప్రధాన పాత్రల్లో శంకర్ (Shankar) తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’.
ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారం జోరు పెంచారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ 256 అడుగుల కటౌట్‌ను విజయవాడలో ఆవిష్కరించారు. ఆ వేదిక మీద నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమాను చిరంజీవి రెండు సార్లు చూశారని, తన రివ్యూ చెప్పారని తెలిపారు. చిరంజీవి ఇదివరకే ఓసారి సినిమా చూశారని, ఇపుడు ఫైనల్ కట్ అయ్యాక మళ్లీ చూడాలని ఆయనకి ఈ రోజు మధ్యాహ్నం చెప్పానని.
సినిమా చూశాక ఆయనే కాల్ చేసి ‘ఈ సారి సంక్రాంతికి మనం గట్టిగా కొట్టబోతున్నాం’ అని చిరంజీవి చెప్పారు అని దిల్ రాజు తెలిపారు. సినిమా ఆయనకు ఆ రేంజ్‌లో నచ్చింది అని దిల్ రాజు చెప్పారు. ఇక డల్లాస్ ఈవెంట్‌లో సుకుమార్ తొలి రివ్యూ ఇచ్చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అని, రామ్ చరణ్ నటనకు జాతీయ పురస్కారం పక్కా అని ఆ రోజు సుకుమార్ చెప్పేశారు.
ఈ లెక్కన ఈ రెండు రివ్యూలు కరెక్ట్ అయితే సినిమా ఓ రేంజిలో విజయం సాధించడం పక్కా అని చెప్పొచ్చు. మరి ఈ రివ్యూలు నిజమవుతాయా? చరణ్ ఆశించిన బ్లాక్‌బస్టర్ విజయం దక్కుతుందా అనేది చూడాలి. ఈ విషయం తేలాలి అంటే సంక్రాంతి రావాల్సిందే. అన్నట్లు ఈ లోపు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అతిథిగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ రోజు ఏం చెబుతారో చూడాలి.
గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!