ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర ముఖాన్ని చూపించకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అయితే నెటిజన్ల మనస్సును తొలిచేస్తున్న ఎన్నో ప్రశ్నలకు సంబంధించి నాగ్ అశ్విన్ నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. కృష్ణుడు డార్క్ షేడ్ లో నిరాకారుడిగా ఉండాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేదని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
అలా కాకపోతే ఆ పాత్ర ఒక వ్యక్తి లేదా యాక్టర్ లా ఉండిపోతుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. కృష్ణుడిని ముదురు రంగు చీకటి రూపులో చూపించాలని ఉండేదని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కల్కి సీక్వెల్ లో కృష్ణుడి ముఖాన్ని చూపించడానికి ఎలాంటి ప్లాన్ లేదని ఆయనను అలాగే చూపించడం కొనసాగిస్తానని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కల్కి సీక్వెల్ లో కృష్ణుడి రోల్ లో మరో హీరో కనిపిస్తారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని నాగ్ అశ్విన్ నుంచి క్లారిటీ వచ్చేసింది.
కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో కృష్ణకుమార్ అనే నటుడు నటించగా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కృష్ణుడి పాత్రకు హైలెట్ గా నిలిచారు. కల్కి సినిమా సెకండ్ వీక్ లో కూడా కలెక్షన్ల పరంగా అదరగొడుతుందేమో చూడాల్సి ఉంది. కల్కి మూవీ 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా కల్కి సీక్వెల్ బడ్జెట్ లెక్కలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
కల్కి సీక్వెల్ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమా సక్సెస్ తో నాగ్ అశ్విన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.