కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ సాధించిన సంచలన విజయంతో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎన్నో మెట్లు పైకి ఎక్కడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా చోటు సంపాదించుకున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ వీకెండ్ కలెక్షన్లతో కల్కి మూవీకి ఫుల్ రన్ కలెక్షన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మాయాబజార్ (Maya Bazaar) మూవీ స్పూర్తితో కల్కి 2898 ఏడీ తీశానని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
కల్కి సినిమా కథను మొదట చిరంజీవికి (Chiranjeevi) చెప్పానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. మొదట కల్కి సినిమాను ఒకే భాగంలో తీయాలని అనుకున్నామని ఇంత పెద్ద కథను ఒక భాగంలో తీయడం సవాల్ గా అనిపించి రెండు భాగాలుగా చూపించాలని అనుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. సినిమాలో భైరవ రోల్ సీరియస్ గా కాకుండా సరదాగా ఉండాలనే అలా క్రియేట్ చేశానని దర్శకుడు చెప్పుకొచ్చారు.
కల్కి సినిమాలోని పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరని భావించానో వాళ్లనే ఎంపిక చేశానని నాగ్ అశ్విన్ వెల్లడించారు. కథలో బలం లేకపోతే నటుల ఎంపిక నెగిటివ్ అయ్యేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పాత్రలకు అనూహ్య స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , మాళవిక నాయర్ (Malavika Nair) నా ఫస్ట్ మూవీ నటులు కాబట్టి వాళ్లు నాకు ప్రత్యేకం అని నాగ్ అశ్విన్ వెల్లడించారు. వాళ్లు నాకు లక్కీ ఛార్మ్ అని ఆయన పేర్కొన్నారు.
కల్కి సినిమాలో మహేశ్ బాబు (Mahesh Babu) కృష్ణుడి పాత్రలో కనిపించే ఛాన్స్ లేదని నాగ్ అశ్విన్ వెల్లడించారు. కల్కి2 సినిమాకు సంబంధించి 20 రోజులు షూట్ జరిపామని కల్కి పాత్రలో ఏ హీరో కనిపిస్తారనేది సస్పెన్స్ అని నాగ్ అశ్విన్ వెల్లడించారు. కల్కి2 రిలీజ్ డేట్ గురించి ఇప్పుడే చెప్పలేమని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కల్కి సీక్వెల్ గురించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.