సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కబాలి’ ‘కాలా’ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు పా.రంజిత్. వీటిలో ‘కబాలి’ చిత్రం పర్వాలేదనిపించినా.. ‘కాలా’ చిత్రం మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈయన చిత్రాల్లో దళితులపై జరుగుతున్న అన్యాయాలను, వాటి పై వీరి పోరాటాల్ని ఎక్కువగా చూపిస్తుంటారు. దీంతో ఆయన ‘దళిత పక్షపాతి’ అనే పేరును కూడా అందుకున్నాడు. ఈయన పై రజనీకాంత్ కూడా ఎంతో అభిమానం చూపిస్తుంటారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల నీల పులిగల్ ఇయక్కం సంస్థాపకుడు ఉమర్ ఫరూక్ వర్థంతి సందర్బంగా జరిగిన ర్యాలీలో డైరెక్టర్ రంజిత్ మాట్లాడుతూ.. ‘రాజరాజ చోళన్ పాలనలో దళితులు అనేక కష్టాలు పడ్డారు, అదొక చీకటి దశ’ అంటూ కామెంట్ చేసాడు. దీంతో అయన వ్యాఖ్యలు దెబ్బతినేలా, జనాన్ని రెచ్చగోట్టేలా ఉన్నాయని పోలీసులకు పిర్యాధు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా , అల్లర్లను రెచ్చగోట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు రంజిత్ పై కూడా కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ముందు పిటిషన్ పెట్టుకున్నాడు. పిటిషన్ స్వీకరించిన బెంచ్ త్వరలోనే దీని పై దృష్టి పెట్టనుందని సమాచారం.