Prasanth Varma: జై హనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఇదేనా.. ప్లాన్ మామూలుగా లేదుగా!

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 330 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో జై హనుమాన్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదలవుతుందని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీరామనవమి పండుగ కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ నెల 17వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని భోగట్టా. జై హనుమాన్ మూవీలో నటించే హీరోల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఎంపికయ్యే హీరోల ఆధారంగా బడ్జెట్ లెక్కలు మారే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.

జై హనుమాన్ మూవీ బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. జై హనుమాన్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావడం మాత్రం సాధ్యం కాదని తెలుస్తోంది. జై హనుమాన్ లో ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ పారితోషికం పెరిగిందని తెలుస్తోంది.

హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరిగిందనే సంగతి తెలిసిందే. (Prasanth Varma) ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని భోగట్టా. జై హనుమాన్ సినిమాలో రాముడి పాత్రలో, హనుమంతుని పాత్రలో నటించే హీరోలెవరో తెలియాల్సి ఉంది. బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus