Prashanth Neel: స్టార్ డైరెక్టర్లకు షాకిస్తున్న ప్రశాంత్ నీల్..?

దర్శకుడిగా తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా స్టార్ డైరెక్టర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. కన్నడ ఇండస్ట్రీ సినిమాలకు ఇతర భాషల్లో రీచ్ తక్కువగా ఉన్న తరుణంలో కేజీఎఫ్ అనే సినిమాతో ప్రశాంత్ నీల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు కన్నడ సినీపరిశ్రమకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కగా జులై 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాకు కన్నడ భాషతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2022 ఏప్రిల్ టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఐదుగురు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు కొన్ని నెలల క్రితమే వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా పట్టాలెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుంది. మహేష్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

KGF director Prashanth Neel about NTR role in his next1

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాటు ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరో సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. కేజీఎఫ్ ఛాప్టర్ 2, సలార్ హిట్టైతే మాత్రమే ప్రశాంత్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకుని ఇతర స్టార్ డైరెక్టర్లకు షాకిస్తూ ఉండటం గమనార్హం. ప్రశాంత్ మరో పదేళ్లపాటు వరుస సినిమాలతో బిజీ అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus