ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో పాన్ ఇండియా వైడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కు ముందే ప్రశాంత్ నీల్ ‘ఉగ్రం’ అనే సినిమా చేశాడు.కన్నడంలో 2014 ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అక్కడ బాగానే ఆడింది. ‘కె.జి.ఎఫ్’ సక్సెస్ అయ్యాక ‘ఉగ్రం’ ని తెలుగులో డబ్ చేయాలని ఆ సినిమా నిర్మాత ప్రశాంత్ నీల్ బ్రదర్ అయిన ప్రదీప్ నీల్ భావించారు.
కానీ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఒకవేళ చేసుంటే డబ్బింగ్ సినిమా రేంజ్లో బాగానే ఆడేది. కానీ ఇదే కథని కొంచెం పెద్ద స్కేల్లో చెప్పాలని.. అప్పుడు దక్కాల్సిన అప్రిసియేషన్ వస్తుంది అని ప్రశాంత్ నీల్ భావించినట్టు ఉన్నాడు. ఇప్పుడు అదే కథని .. కొన్ని మార్పులు చేసి ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. డిసెంబర్ 22న అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో (Ugram) ‘ఉగ్రం’ కథ వైరల్ అవుతుంది.
ఆ సినిమా కథ విషయానికి వస్తే…అగస్త్య(శ్రీ మురళి) తండ్రి ఓ ఏరియాకి చెందిన రౌడీలు చంపేస్తారు. అంతేకాకుండా అతని శవాన్ని కూడా అప్పగించకుండా.. కుక్కలకు ఆహారంగా వేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ టైంలో బాల(తిలక్ శేఖర్) తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పి అగస్త్య తండ్రి శవాన్ని అతని వాళ్ళకి అప్పగించేలా చేస్తాడు. బాల తండ్రి కూడా ఆ ఏరియాకి చెందిన పెద్ద రౌడీ. ఇక బాల పై కృతజ్ఞతతో అగస్త్య.. చిన్నప్పుడే అతనికి ఓ మాట ఇస్తాడు. భవిష్యత్తులో నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను నీకు అండగా నిలబడి సాయం చేస్తాను అని బాలాకి మాట ఇస్తాడు.
అటు తర్వాత కొన్నాళ్ళకి బాల తండ్రి కొన్ని గొడవల్లో మరణిస్తాడు. ఈ టైంలో కొంతమంది రౌడీలు, దాదాలు తమకి ఓ ఏరియా కావాలని… బాల నివసించే ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఏరియాకి వాళ్ళు మందలు మందలుగా వచ్చి బాలాకి చెందిన రెండు ఏరియాలని స్వాధీనం చేసుకుంటారు. అలాగే బాలాని అక్కడి జనాలని చిత్ర హింసలు పెడుతూ ఉంటారు. బాల వద్ద ఉన్న జనాలు కూడా వారిని ఎదిరించలేక ఎన్నో అవమానాలు పడతారు. ఆ టైంలో బాల.. అగస్త్య సాయం కోసం వెళ్తాడు. ఇచ్చిన మాట కోసం సాయం చేయడానికి అగస్త్య వచ్చి బాల..ని డాన్ గా నిలబెడతాడు.
కానీ బాల సోదరుడుకి అగస్త్య అంటే నచ్చదు. బాల ఎక్కువగా అగస్త్య మాటకి విలువ ఇస్తుండటంతో..అతని తమ్ముడు అగస్త్యపై పగ పెంచుకుంటూ ఉంటాడు. ఒకసారి అగస్త్య చేయొద్దు అని చెప్పిన పని బాల తమ్ముడు చేయడంతో.. అగస్త్య అతన్ని చంపేస్తాడు. దీంతో బాల , అగస్త్య..ల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. చివరికి అందులో వీళ్ళు కలిసినట్టు కూడా చూపించరు. మధ్యలో హీరోయిన్ తో లవ్ ట్రాక్ పెట్టి వేరే విలన్ ని దింపుతారు. మరి ఈ కథని ‘సలార్’ గా ఎంత ఇంట్రెస్టింగ్ గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడో చూడాలి..!
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!