ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను అందంగా చూపించే దర్శకుల లిస్ట్ రాస్తే… కచ్చితంగా తొలి స్థానంలో ఉండే పేరు రాఘవేంద్రరావు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్స్ ఉంటాయి అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనతో నటించి కథానాయికలు, కథానాయకులు ఇదే మాట చెబుతుంటారు. అయితే ఆయనకు మాత్రమే ఎలా సాధ్యమైంది. అందరి దర్శకులకు ఆయనకు తేడా ఏంటి అనే డిస్కషన్ ఎప్పటి నుండో జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆయనకు ఈ విషయంలో చిన్న క్లారిటీ ఇచ్చారు.
హీరోయిన్లను తాను మాత్రమే ఎలా అందంగా చూపించగలుగుతున్నారు అనే విషయంపై ఆయన మాట్లాడుతూ అందంగా ఉన్నదే చూపించాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతాను చెప్పారు. ఒకసారి రాజమౌళి ఇదే విషయాన్ని రాఘవేంద్రరావును అడిగారట. దానికి ఆయన అప్పుడు చెప్పిన సమాధానాన్నే మళ్లీ ఇప్పుడు చెప్పారు. తాను హీరోయిన్ ముఖం చూడను అని అప్పుడు రాజమౌళికి రాఘవేంద్రావు సరదాగా సమాధానమిచ్చారట.
అలా ఎందుకు అన్నారు అనే విషయం కూడా చెప్పారాయన. ఎవరూ పూర్తిగా అందంగా ఉండరు. వారిలోని మైనస్‌లను పక్కన పెట్టి అందంగా ఉండే అంశాలను సినిమాలో చూపించాలి అప్పుడే అందంగా కనిపిస్తారు. నడుము విషయమే తీసుకుంటే… అందరి నడుము బాగుండదు. శ్రీదేవి విషయం తీసుకుంటే ఆమె నడుము కడవలా ఉంటుంది. అందుకే ఒక పాటలో ఆమె నడుమును కడవతో పోలుస్తూ షాట్ పెట్టాను అని చెప్పారు దర్శకేంద్రుడు. ఆ షాట్ ఆ రోజుల్లో హైలైట్ అయ్యిందని కూడా చెప్పారు.
అలా ప్రతి హీరోయిన్‌లో ఓ అందమైన అంశం ఉంటుంది. దానిని గ్రహించి అదే ఎక్కువగా తెరపై చూపించాలి. అప్పుడు ఆటోమేటిగ్గా హీరోయిన్ అందంగా కనిపిస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. తన ఫార్ములా మైనస్‌లు కవర్ చేయడమే అని చెప్పారాయన. ఈ పాయింట్‌ను ఇప్పటికే కొంతమంది యువ దర్శకులు ఫాలో అవుతున్నారు. అందుకే కొన్ని సినిమాలు హీరోయిన్ల శరీర భాగాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఇప్పుడు దర్శకేంద్రుడు (Raghavendra Rao) మాట విన్నాక మిగిలిన వాళ్లు కూడా ఈ ఫార్ములాను ఎక్కువగా ఫాలో అవుతారేమో.