ఆ దర్శకుడి “చీకటి ప్రేమకథ”

“మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు, ఒక మనసు” చిత్రాలు దర్శకుడిగా రామరాజుకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే.. కమర్షియల్ హిట్ ను మాత్రం ఇవ్వలేకపోయాయి. ఈ రెండు సినిమాల్లోనూ మసాలా క్వాంటీటీ లేకపోవడమే అందుకు కారణమని భావించిన రామరాజూ తన తదుపరి చిత్రంగా ఓ కమర్షియల్ లవ్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. రామరాజు దర్శకత్వంలో “ఒక మనసు”ను నిర్మించిన మధుర శ్రీధర్ రెడ్డి ఈ తాజా చిత్రాన్ని కూడా నిర్మిస్తారట.

కథా చర్చలు ముగిశాయని. ప్రస్తుతం హీరోహీరోయిన్ల కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి “చీకటి ప్రేమకథ” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారట. మరి రూటు మార్చిన రామరాజును విజయం వారిస్తుందో లేదో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus