Sekhar Kammula: అలాంటి కాన్సెప్ట్ తో శేఖర్ కమ్ముల కొత్త మూవీ.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకు (Sekhar Kammula)  ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ దర్శకుని గురించి మాట్లాడుకోవాలంటే ఫిదా (Fidaa) సినిమాకు ముందు ఫిదా సినిమా తర్వాత అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Dhanush) ధనుష్, (Nagarjuna) నాగార్జున కాంబోలో కుబేర అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. నాగార్జున ఈ సినిమాలో ఈడీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ధనుష్ ఈ సినిమాలో మాఫియా డాన్ గా కనిపిస్తారని డబ్బు కోసం ఎన్నో తప్పులు చేసే విధంగా ఆయన రోల్ ఉంటుందని సమాచారం అందుతోంది.

పోలీసులు ధనుష్ పాత్రను చంపడానికి ప్రయత్నించే క్రమంలో అతను ఒక ఊరికి వచ్చి ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని బిచ్చగాడిగా తన రూపాన్ని మార్చుకుంటాడని తెలుస్తోంది. బిచ్చగాడిగా మారిన ధనుష్ మళ్లీ కుబేరుడు అవుతాడా? అతని జీవితంలో వచ్చిన మార్పులేంటి? అతనిలో మార్పు రావడానికి ఈడీ ఆఫీసర్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ధనుష్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిరాశ పరుస్తున్నాయి.

ధనుష్ వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్ లో నటించిన సార్ (Sir) మూవీ మాత్రం అంచనాలకు మించి విజయం సాధించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. నాగార్జున కెరీర్ కు కూడా భారీ హిట్ అవసరం కాగా ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది.

మొదట ఈ సినిమాకు ధారావి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపించగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. శేఖర్ కమ్ముల ఫిదా, లవ్ స్టోరీ (Love Story) బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus