అమలాపాల్ హగ్ ఇవ్వడానికి వస్తే తప్పించుకున్న డైరక్టర్

  • October 16, 2018 / 11:25 AM IST

డైరక్టెర్, హీరోయిన్.. ఇద్దరి మధ్య అనుబంధం వారి వయసు తేడా బట్టి ఉంటుంది. పెద్ద వయసు ఉన్న డైరక్టర్ తో సినిమా చేస్తుంటే సదరు హీరోయిన్ గురువులా గౌరవిస్తుంది. తోటి వయసుగల డైరక్టర్ తో సినిమా చేస్తుంటే స్నేహితుడిలా పలకరిస్తుంది. నేటి జనరేషన్ లో షేక్ హ్యాండ్, హగ్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది. అదే అలవాటుతో అమలాపాల్ తన డైరక్టర్ కి హగ్ ఇవ్వడానికి పోతే అతను తప్పించుకున్నారంట. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను నేడు అమలా పాల్ బయటపెట్టింది. అమలా పాల్ నటించిన “రాక్షసన్” అనే చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అమలా పాల్ అనేక సంగతులు చెప్పింది.

“సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత… సినిమాను బాగా తీశారని దర్శకుడు రామ్ కుమార్ ను అభినందించేందుకు ఆయన్ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఆయన కంగారు పడి తప్పించుకున్నారు” అని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం “మీటూ” అంటూ లైంగిక వేదింపుల ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే జాగ్రత్త పడి ఉంటారని నెటిజనులు భావిస్తున్నారు. అదే మీటూ ఉద్యమం గురించి అమలా పాల్ మాట్లాడుతూ.. “నేను గత ఫిబ్రవరిలో మీటూ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం మొదలయింది. మీటూ అనేది ఒక మంచి ఉద్యమం.. ఇది ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ప్రస్తుతం తమిళం, మలయాళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus