Akhil: శ్రీకాంత్ అయినా అఖిల్ కి హిట్ అందిస్తారా?

అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటివరకు సుమారు ఐదు సినిమాలలో నటించారు.అయితే ఈయన నటించిన ఈ సినిమాలలో ఇప్పటివరకు చెప్పుకోదగిన సినిమా ఏది కూడా లేదని చెప్పాలి.ఇక ఈయన నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కాస్త పరవాలేదు అనిపించుకున్నప్పటికీ మిగిలిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. తాజాగా వచ్చిన ఏజెంట్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఎన్నో అంచనాల నడుమ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీగా ఏజెంట్ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా విడుదలకు ముందు వరకు భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ కు సినిమాలు కలిసి రాలేదని ఈయన క్రికెట్ వైపు అడుగులు వేస్తే బాగుంటుందని కూడా సలహాలు ఇచ్చిన వారు ఉన్నారు.

ఇక అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి అఖిల్ ఒక హిట్ కూడా అందుకోకపోవడంతో అభిమానులను నిరాశ వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఈయనకు దర్శకులుగా పనిచేసిన ఈయనకు హిట్ ఇవ్వడం ఎవరి వల్ల కాలేదు. అయితే మరోసారి ఈయన అదృష్టాన్ని పరీక్షించడానికి శ్రీకాంత్ అడ్డాల రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.

కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు ప్రేమ కథ సినిమాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దే శ్రీకాంత్ అడ్డాల అఖిల్ కోసం ఓ అద్భుతమైన మాస్ యాక్షన్ సినిమాని తయారు చేశారని తెలుస్తుంది. ఇలా మాస్ యాక్షన్ సినిమా ద్వారా మరోసారి ఈయన అఖిల్ అదృష్టాన్ని పరీక్షించబోతున్నారట అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.దిల్ రాజు సినిమాకు కమిట్ అయ్యారు అంటే 50% సినిమా సక్సెస్ అయినట్లేనని చెప్పాలి. మరి శ్రీకాంత్ అడ్డాల అయిన అఖిల్ కు సక్సెస్ అందిస్తారా లేదా వేచి చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus