ఆ విషయంలో ‘రణరంగం’ డైరెక్టర్ ను అభినందించాల్సిందే..!

‘స్వామిరారా’ చిత్రంతో ట్యాలెంటడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఆ చిత్రం మంచి హిట్టైంది కూడా..! అయితే ఆ తరువాత వచ్చిన ‘దోచేయ్’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక తరువాత వచ్చిన ‘కేశవ’ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని హీరో శర్వానంద్ తో ‘రణరంగం’ సినిమా చేశాడు. కాజల్ – కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు15న విడుదల కాబోతుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్లను వేగవంతం చేశారు.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సుధీర్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆయన మాట్లాదుతూ… ” ‘రణరంగం’ సినిమా పూర్తి శ్రద్ధ పెట్టి చేశాను. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. శర్వానంద్ కి హిట్ ఇస్తాననే అనుకుంటున్నాను. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమ బ్యానర్లోనే మరో సినిమా చేయమని అడుగుతున్నారు. ‘రణరంగం’ సినిమా హిట్ అయితే తప్పకుండా సీక్వెల్ చేస్తాను. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ నాకు ఒక లైన్ చెప్పాడు .. ఆ లైన్ నాకు బాగా నచ్చింది. ‘రణరంగం’ విడుదల తరువాత ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్ వర్మ. ఇక్కడ ఓ విషయంలో సుధీర్ వర్మని అభినందించాలి.. చేసిన సినిమా విడుదల కాకుండానే మరో సినిమా ఓకే చేయించేసుకుని అడ్వాన్స్ లాగేసుకోవాలని ఆయన అనకుండా హిట్టయితే కచ్చితంగా సీక్వెల్ చేస్తాను అని చెప్పడం గ్రేట్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus